ఎన్టీఆర్ చాలా సీరియస్ అంట..!
ప్రస్తుతం త్రివిక్రమ్... ఎన్టీఆర్ హీరోగా 'అరవింద సమేత వీరరాఘవ' సినిమాను దర్శకత్వం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా విషయంలో త్రివిక్రమ్ చాలా శ్రద్ద పెట్టి తీస్తున్నాడట. సినిమా మొత్తం ఎన్టీఆర్ పాత్ర చాలా సీరియస్ గా ఉండబోతుందని తెలుస్తుంది. 'అతడు' మాదిరిగా హీరో పాత్ర ఎక్కడా తగ్గకుండా చాలా సీరియస్ గా ఉంటుందని అర్ధం అవుతుంది. ఎన్టీఆర్ తో కామెడీ చేయించకుండా పక్కన పాత్రలతో కాస్త వినోదం పండించనున్నాడట త్రివిక్రమ్. ఇందులో ఫ్యామిలీ డ్రామా, రొమాన్స్ అతడు మాదిరిగానే అనిపిస్తాయట.
గత అనుభవంతో...
త్రివిక్రమ్ 'అజ్ఞాతవాసి' సినిమాని కూడా సీరియస్‌గానే తీద్దామనుకుని తర్వాత మనసు మార్చుకున్నాడు. దాని ఫలితం ఏంటో మనకు తెలిసిందే. అందుకే ఆ తప్పును 'అరవింద సమేత' విషయంలో చేయకూడదని ఫిక్స్ అయ్యి సినిమా చేసాడంట. సినిమా మొత్తం ఎంత సీరియస్ గా సాగుతున్నా ఎమోషన్స్ బాగా ఎంగేజ్ చేస్తాయని, యాక్షన్ పార్ట్ చాలా 'రా' గా అనిపిస్తునే కొత్తగా ఉంటుందని సమాచారం. ఈ మధ్య లీక్ అయిన వీడియో బట్టి ఇది నిజమే అనిపిస్తుంది. త్వరలోనే ప్రీ రిలీజ్ ఈవెంట్ తో పాటు ట్రైలర్ ని కూడా రిలీజ్ చేయనున్నారు మేకర్స్. దసరా కానుకగా ఈ సినిమా అక్టోబర్ 11న వరల్డ్ వైడ్ గా విడుదల అవుతుంది.