Mon Dec 23 2024 03:00:43 GMT+0000 (Coordinated Universal Time)
ఎన్టీఆర్ వెళ్ళింది అక్కడికేనా..?
నందమూరి తారకరామారావు ఇటీవల ఎయిర్ పోర్టులో కనిపించారు. బ్లాక్ సన్ గ్లాసెస్, డార్క్ జాకెట్, బ్లాక్ టీషర్ట్, జీన్స్ ప్యాంట్ ధరించి.. వైట్ షూస్‌తో స్టైలిష్ లుక్ తో ఎన్టీఆర్ ఎయిర్ పోర్టులో తన కుటుంబంతో కలిసి పయనమయ్యారు. ఆయన తన ఫ్యామిలీతో కలిసి ఎయిర్పోర్ట్ లో కనిపించారు. భార్య ప్రణతి, కుమారులు అభయ్ రామ్, భార్గవ్రామ్లతో కలిసి తారక్ వెళుతున్న వీడియోలు వైరల్ అవుతున్నాయి. వీరంతా జపాన్ వెళ్తున్నారు. 'ఆర్ఆర్ఆర్' సినిమా జపాన్‌లో రిలీజ్‌కి రెడీ అయ్యింది. అక్టోబర్ 21న ఈ సినిమా జపాన్ భాషలో విడుదల కానుండటంతో ప్రమోషన్స్ కోసం సినిమాలో నటించిన స్టార్స్ అక్కడికి వెళ్లారు. ఇప్పటికే తన భార్యతో అక్కడికి వెళ్లాడు రామ్ చరణ్.
ఎన్టీఆర్, చరణ్, రాజమౌళి.. `ఆర్ఆర్ఆర్` జపాన్ ప్రమోషన్స్ లో పాల్గొననున్నారు. రెండు రోజుల పాటు ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనడమే కాకుండా.. ఫ్యామిలీతో జపాన్ టూర్‌ని ఎంజాయ్ చేయబోతున్నారు. వీరంతా ఫ్యామిలీతో కలిసి వెళ్లినట్లు తెలుస్తోంది. జపాన్ సినీ లవర్స్ సినిమాలను బాగా ఆదరిస్తూ వస్తుంటారు. ఇండియన్ సినిమాలను కూడా బాగా ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. గతంలో బాహుబలి ఎంత భారీగా సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అక్కడి నుండి ఎన్నో లెటర్స్ బాహుబలి స్టార్స్ కు అందాయి. ప్రభాస్ ను కలవడానికి అక్కడి నుండి వచ్చిన ఫ్యాన్స్ కూడా ఎంతో మంది ఉన్నారు. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ ఎటువంటి ప్రేమను వారి నుండి దక్కించుకుంటుందో చూడాలి.
Next Story