Mon Dec 23 2024 17:18:55 GMT+0000 (Coordinated Universal Time)
అల్లు అర్జున్,కల్యాణ్ రామ్ కార్ల బ్లాక్ ఫిల్మ్ తొలగింపు, జరిమానా!
టాలీవుడ్ హీరోలు అల్లు అర్జున్, కల్యాణ్ రామ్ కార్లకు ఉన్న బ్లాక్ ఫిల్మ్ లను తొలగించి, చలానాలు విధించారు.
హైదరాబాద్ : జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీసులు.. ఇటీవల బ్లాక్ ఫిల్మ్ ఉన్న కార్లను గుర్తించి, వాటిని తొలగించే పనిలో పడ్డారు. తాజాగా ఈ తనిఖీలను మరింత ముమ్మరం చేశారు. టాలీవుడ్ హీరోలు అల్లు అర్జున్, కల్యాణ్ రామ్ కార్లకు ఉన్న బ్లాక్ ఫిల్మ్ లను తొలగించి, చలానాలు విధించారు. శనివారం జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 36లోని నీరూస్ చౌరస్తాలో ట్రాఫిక్ పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు.
ఈ తనిఖీల్లో వీఐపీ స్టిక్కరింగ్ ఉన్న కార్లు, బ్లాక్ ఫిల్మ్ ఉన్న కార్లను గుర్తించి వాటిని తొలగించారు. అదే సమయంలో అటువైపు నుంచి వెళ్తున్న కల్యాణ్‌రామ్, అల్లు అర్జున్ కార్లను ఆపారు. అనంతరం వాటికున్న బ్లాక్ ఫిల్మ్‌లను తొలగించి రూ.700 చొప్పున చలాన్లు విధించారు. సరైన నిబంధనలు పాటించని మరో 80కి పైగా వాహనాలపై కేసులు నమోదు చేశారు.
Next Story