Mon Dec 23 2024 02:51:17 GMT+0000 (Coordinated Universal Time)
రోడ్డు ప్రమాదంలో నటి మృతి !
సినీ పరిశ్రమలో జూనియర్ ఆర్టిస్ట్ గా ఉన్న ఆమె నిన్న రాత్రి గచ్చిబౌలిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించింది. ప్రమాద సమయంలో కారులో..
హైదరాబాద్ : శుక్రవారం రాత్రి గచ్చిబౌలిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రముఖ యూ ట్యూబర్, నటి డాలీ (గాయత్రి) మృతి చెందింది. ఈ విషయాన్ని టాలీవుడ్ ప్రముఖ నటి సురేఖావాణి వెల్లడించారు. ఆమె తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో డాలీతో కలిసి ఉన్న ఫొటోను షేర్ చేస్తూ ఇలా రాశారు. "డాలీ ఇది చాలా అన్యాయం. ఇది నమ్మడానికి చాలా కష్టంగా ఉంది. నీతో నాకు అద్భుతమైన జ్ఞాపకాలున్నాయి. అసలు మాటలు రావట్లేదు. టోటల్లీ బ్లాంక్" అని పోస్ట్ చేశారు. గచ్చిబౌలి రోడ్డుప్రమాదంలో నటి డాలీ చనిపోయిందని తెలిసిన వారు సోషల్ మీడియాలో నివాళులు అర్పిస్తున్నారు.
డాలీ అసలు పేరు గాయత్రి. సినీ పరిశ్రమలో జూనియర్ ఆర్టిస్ట్ గా ఉన్న ఆమె నిన్న రాత్రి గచ్చిబౌలిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించింది. ప్రమాద సమయంలో కారులో రోహిత్ అనే యువకుడితో పాటు మరో యువతి, డాలీ ఉన్నట్లు సమాచారం. మద్యంసేవించి కారు నడపడం వల్ల ప్రమాదం జరిగినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఎల్లా హోటల్ లో పనిచేస్తున్న మహేశ్వరి అనే మరో మహిళ కూడా మృతి చెందింది. నిన్న హోలీ పండగ సందర్భంగా గాయత్రి, రోహిత్ లు ప్రిసంపబ్ లో పార్టీ చేసుకుని, ఇంటిరి తిరుగుపయనమైన సమయంలో ప్రమాదం జరిగింది. ప్రమాదంలో గాయత్రి మరణించగా, రోహిత్ కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం అతను AIG లో వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నట్టు తెలుస్తోంది.
Next Story