Mon Dec 23 2024 10:27:36 GMT+0000 (Coordinated Universal Time)
పార్టీ లేదా పుష్ప.. నెట్టింట వైరల్ అవుతున్న ఎన్టీఆర్-బన్నీ ట్వీట్లు
అల్లు అర్జున్ శనివారం తన 41వ పుట్టినరోజు జరుపుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయనకు పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు
టాలీవుడ్ హీరోల బర్త్ డే లు, కొత్త సినిమాల ఓపెనింగ్స్ అంటే చాలా హడావిడి ఉంటుంది. ముఖ్యంగా అభిమాన హీరోల పుట్టినరోజులంటే చాలు.. ఫ్యాన్స్ ఎక్కడ లేని హంగామా చేస్తారు. కానీ.. ఈసారి బన్నీ బర్త్ డే కి జూనియర్ ఎన్టీఆర్ హంగామా చేశాడు. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్.. బన్నీకి సోషల్ మీడియాలో బర్త్ డే విషెస్ చెప్పారు. అల్లు అర్జున్ వారిద్దరికీ రిప్లై ఇచ్చాడు. కానీ ఎన్టీఆర్ తో జరిగిన కన్వర్జేషన్ కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉండే సరికి ఆ ట్వీట్లు వైరల్ అయ్యాయి.
అల్లు అర్జున్ శనివారం తన 41వ పుట్టినరోజు జరుపుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయనకు పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ఇక ఎన్టీఆర్ కూడా సోషల్ మీడియా వేదికగా బర్త్‌డే విషెస్ చెప్పారు. ‘‘హ్యాపీ బర్త్‌డే బావా. ఈ ఏడాది నీకు అద్భుతంగా సాగాలని కోరుకుంటున్నా’’ అని తారక్ ట్వీట్ చేయగా.. అందుకు బన్నీ ‘‘నీ లవ్లీ విషెస్‌కు థ్యాంక్యూ బావా. నీకు నా హగ్స్’’ అని చెప్పారు. వెంటనే రిప్లై ఇచ్చిన ఎన్టీఆర్..కేవలం హగ్స్ మాత్రమేనా? పార్టీ లేదా పుష్పా? అంటూ పుష్పా డైలాగ్‌ను గుర్తుకు తెస్తూ తారక్ మరో ట్వీట్ చేశాడు. దాని బన్నీ కూడా ఎన్టీఆర్ 30 సినిమాను ప్రస్తావిస్తూ.. ‘‘వస్తున్నా’’ అని రిప్లై ఇచ్చాడు. ఇలా ఇద్దరు స్టార్ హీరోలు ఒకరి సినిమా గురించి ఒకరు మాట్లాడుతూ చేసిన సంభాషణ నెటిజన్లకు బాగా నచ్చింది. ఆ ట్వీట్లకు మిలియన్ల వ్యూస్ రావడం విశేషం.
Next Story