Mon Dec 23 2024 00:25:41 GMT+0000 (Coordinated Universal Time)
రీ రిలీజ్ కి రెడీ అవుతున్న జూ.ఎన్టీఆర్ ఫ్లాప్ సినిమా
తాజాగా.. కొరటాల శివతో సినిమా చేసేందుకు ప్లాన్ లో ఉన్నాడు. సినిమా ప్రకటించి రోజులు గడుస్తున్నా.. ఇంకా సెట్స్ పైకి..
యంగ్ టైగర్ ఎన్టీఆర్ RRR సినిమా తర్వాత పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు పొందాడు. విదేశాల్లో ఎన్టీఆర్ కు గుర్తింపు లభిస్తోంది. తాజాగా.. కొరటాల శివతో సినిమా చేసేందుకు ప్లాన్ లో ఉన్నాడు. సినిమా ప్రకటించి రోజులు గడుస్తున్నా.. ఇంకా సెట్స్ పైకి వెళ్లలేదు. తాజాగా ఈ సినిమాలో ఎన్టీఆర్ కు జోడీగా జాన్వీ కపూర్ నటిస్తోందని చిత్రయూనిట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ప్రకటనతో సినిమాపై కాస్త అంచనాలు పెరిగాయి. ప్రస్తుతం ఆస్కార్ అవార్డుల వేడుక కోసమై ఎన్టీఆర్ అమెరికాకు వెళ్లాడు.
ఎన్టీఆర్ నటించిన ఓ సినిమాను ఈ నెలలోనే విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని ఆయనే అభిమానులకు తెలిపారు. అదే పూరీ జగన్నాధ్ డైరెక్షన్లో ఎన్టీఆర్ డ్యుయెల్ రోల్లో నటించిన ఆంధ్రావాలా. అప్పట్లో ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలైంది కానీ.. ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. ఆ ఫ్లాప్ సినిమాను త్వరలోనే రీ రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరి ఈ సినిమాకు ప్రేక్షకులు, అభిమానుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.
Next Story