Sat Dec 21 2024 04:55:33 GMT+0000 (Coordinated Universal Time)
భార్యకు క్యూట్ గా బర్త్ డే విషెస్ చెప్పిన జూ.ఎన్టీఆర్
ఇప్పటివరకూ 10 లక్షలకు పైగా లైకులు, దాదాపు 7 వేల కామెంట్లు వచ్చాయి. కాగా.. అంతర్జాతీయ స్థాయిలో ఆర్ఆర్ఆర్ గుర్తింపు..
కుటుంబ విషయాలను అభిమానులతో చాలా అరుదుగా పంచుకునే హీరోల్లో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. ఎప్పుడో ఒకసారి పిల్లలు, భార్య ఫొటోలను నెట్టింట్లో పెడుతుంటారు. తాజాగా భార్య లక్ష్మీ ప్రణతి పుట్టినరోజు సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ ఇన్ స్టా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. వారిద్దరూ కలిసున్న ఫొటో ఒకటి ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేసిన ఎన్టీఆర్..‘హ్యాపీ బర్త్ డే అమ్మలు’ అంటూ స్పెషల్ విషెస్ తెలిపారు.
ఆయన ఇలా పోస్ట్ చేశారో లేదో.. అభిమానుల నుంచి లైకులు, కామెంట్ల వర్షం వెల్లువెత్తింది. ‘హ్యాపీ బర్త్ డే వదిన’ అంటూ ఈ రోజు ఉదయం నుంచి అభిమానులు విష్ చేస్తున్నారు. ఇప్పటివరకూ 10 లక్షలకు పైగా లైకులు, దాదాపు 7 వేల కామెంట్లు వచ్చాయి. కాగా.. అంతర్జాతీయ స్థాయిలో ఆర్ఆర్ఆర్ గుర్తింపు తెచ్చుకోవడంతో మంచి జోష్ లో ఉన్న ఎన్టీఆర్.. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ఎన్టీఆర్ 30 అనే వర్కింగ్ టైటిల్ తో ఇటీవలే ఈ చిత్రం అధికారికంగా ప్రారంభమైంది. ఇందులో ఎన్టీఆర్ సరసన జంటగా శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ నటిస్తోంది.
- Tags
- Jr NTR
- Ram Charan
Next Story