Mon Dec 23 2024 08:08:07 GMT+0000 (Coordinated Universal Time)
పొలిటికల్‌గా ఇక్కడ విమర్శలు.. ఎన్టీఆర్ అక్కడ ఎమోషనల్ స్పీచ్..
ఇక్కడ పొలిటికల్ గా ఎన్టీఆర్ ని విమర్శిస్తున్న వారికీ గట్టి సమాధానం చెబుతున్న అభిమానులను ఉద్దేశించి అక్కడ ఎన్టీఆర్ ఇచ్చిన ఎమోషనల్ స్పీచ్..
జూనియర్ ఎన్టీఆర్‌కి సినీ రంగంలోనే కాదు పొలిటికల్ ఫీల్డ్ లో కూడా అద్భుతమైన ఫాలోయింగ్ ఉంది. మీసాలు వస్తున్న వయసులోనే ఇటు నటుడిగా, అటు రాజకీయ లీడర్ గా కూడా డైలాగ్స్ చెప్పి అదరగొట్టాడు. అయితే కొన్నాళ్ల నుంచి ఎన్టీఆర్ రాజకీయాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ ఎంత దూరంగా ఉన్నా.. తన పేరు మాత్రం ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ లో వినిపిస్తూనే ఉంటుంది.
ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబుని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. దీని పై స్పందిస్తూ.. రాఘవేంద్రరావు, అశ్వినీ దత్ వంటి పలువురు సినీ ప్రముఖులు రియాక్ట్ అవుతూ వచ్చారు. అలాగే కొందరు నందమూరి కుటుంబసభ్యులు కూడా రెస్పాండ్ అయ్యారు. అయితే ఈ విషయం పై జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటివరకు రియాక్ట్ అవ్వలేదు. దీంతో పలువురు టీడీపీ అభిమానులు ఎన్టీఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్ ని విమర్శిస్తూ వ్యాఖ్యలు చేస్తున్నారు.
ఈ విషయంలో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు తారక్ ని సపోర్ట్ చేసుకుంటూ వస్తున్నారు. రాజకీయాలకు దూరంగా ఉన్న వ్యక్తిని ఎందుకు ఇంతలా విమర్శిస్తున్నారు అంటూ ఎన్టీఆర్ ని సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో ఎన్టీఆర్ అండ్ టీడీపీ ఫ్యాన్స్ మధ్య ట్వీట్స్ వార్ జరుగుతుంది. కాగా ఎన్టీఆర్ SIIMA అవార్డుల్లో పాల్గొనేందుకు ఇటీవల దుబాయ్ వెళ్లిన సంగతి తెలిసిందే. ఇక అక్కడ RRR మూవీకి గాను ఉత్తమ నటుడు అవార్డుని అందుకున్న ఎన్టీఆర్ అభిమానులను ఉద్దేశించి ఎమోషనల్ స్పీచ్ ఇచ్చాడు.
తన ఒడిదుడుకుల్లో అభిమానులు తనకెప్పుడు తోడున్నారని గుర్తు చేసుకున్నాడు. తను కింద పడ్డప్పుడల్లా చెయ్యి పట్టుకొని తనని పైకి లేపారని, తన ప్రతి కన్నీటి చుక్కకు వాళ్ళు కూడా బాధపడ్డారని, తాను నవ్వినప్పుడు అభిమానులు ఆనందపడ్డారని తెలియజేశాడు. ఇలా ప్రతి సమయంలో తనకి తోడు ఉంటున్న అభిమాన సోదరులందరికి పాదాభివందనాలు అంటూ ఎమోషనల్ స్పీచ్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన అభిమానులు.. 'నీ వెంటే ఎపుడు ఉంటాము అన్నా' అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Next Story