కొత్త అవతారంలో తారక్
రాజమౌళి సినిమా #RRR కోసం ఒకపక్క కష్టపడుతూనే మరోపక్క కొన్ని ఎండార్స్మెంట్స్ కు కమిట్ అవుతున్నాడు తారక్. గత ఏడాది బిగ్ బాస్ షో ని హోస్ట్ [more]
రాజమౌళి సినిమా #RRR కోసం ఒకపక్క కష్టపడుతూనే మరోపక్క కొన్ని ఎండార్స్మెంట్స్ కు కమిట్ అవుతున్నాడు తారక్. గత ఏడాది బిగ్ బాస్ షో ని హోస్ట్ [more]
రాజమౌళి సినిమా #RRR కోసం ఒకపక్క కష్టపడుతూనే మరోపక్క కొన్ని ఎండార్స్మెంట్స్ కు కమిట్ అవుతున్నాడు తారక్. గత ఏడాది బిగ్ బాస్ షో ని హోస్ట్ చేసి సక్సెస్ అయినా తారక్ కమర్షియల్ యాడ్స్ చేయడంలో ఒక అడుగు ముందే ఉన్నాడు. రీసెంట్ గా ఆయన కమర్షియల్ ‘ఫీల్ ది ఫిజ్జ్’..! యాప్పి ఫిజ్ అనే యాపిల్ జ్యూస్‌కి ‘బ్రాండ్ అంబాసిడర్’గా ఇటీవలే సంతకం చేశాడు.
సౌత్ ఇండియా మొత్తానికి తారక్ ఈ ప్రోడక్ట్ కు బ్రాండ్ వ్యాల్యుని పెంచాల్సిన బాధ్యత తీసుకున్నాడు. తెలుగు తో పాటు…కర్ణాటకలో కూడా ఈ ప్రోడక్ట్ ని పెంచనున్నాడు. ఆల్రెడీ ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించి ఇప్పటికే వాణిజ్య ప్రకటనల తాలూకు వీడియో షూట్స్ పూర్తయ్యాయి. అయితే దీనిపై పార్లే ఆగ్రో సంస్థ స్పందిస్తూ ‘మాకు సౌత్ ఇండియన్ ఫేస్‌గా నిలబడడానికి టాలీవుడ్ సూపర్ స్టార్ జూనియర్ ఎన్టీయార్ ఒప్పుకున్నందుకు కృతజ్ఞతలు’ అని తెలిపారు.
సౌత్ మొత్తానికి ఎన్టీఆర్ అయితే నార్త్ మొత్తానికి బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్‌తో ఒప్పందం కుదుర్చుకున్న ఈ సంస్థ, త్వరలోనే ఎన్టీఆర్ నటించిన యాడ్ ను రిలీజ్ చేయనున్నారు . ఎన్టీఆర్ కూడా ఈ ప్రోడక్ట్ కి బ్రాండ్ అంబాసిడర్ గా చేయడం చాలా ఆనందంగా ఉందని ట్వీట్ చేసాడు.