Mon Dec 15 2025 04:09:50 GMT+0000 (Coordinated Universal Time)
అద్భుతమైన దర్శకుడు జక్కన్న... జూనియర్ కితాబు
రాజమౌళి ఒక అద్భుతమైన దర్శకుడని జూనియర్ ఎన్టీఆర్ అన్నారు. ఆర్ఆర్ఆర్ ట్రైలర్ విడుల మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు

రాజమౌళి ఒక అద్భుతమైన దర్శకుడని జూనియర్ ఎన్టీఆర్ అన్నారు. ఆర్ఆర్ఆర్ ట్రైలర్ విడుల మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. హిందీ, తమిళం, తెలుగు డబ్బింగ్ ను చెప్పుకోగలిగామని, మలయాళం మాత్రం చెప్పులేకపోయామని తారక్ తెలిపారు. కధను నడిపించడానికి సరైన నటులు కావాలన్నారు రాజమౌళి. ప్రేక్షకలును ఈ మూవీ థియేటర్ కు రప్పిస్తుందన్న నమ్మకంతో ఉన్నానని చెప్పారు.
మాకు పిచ్చెక్కిపోయింది....
ఈ మూవీ ట్రలైర్ చూసి ముంబయిలో తమకు పిచ్చెక్కిపోయిందని ఆలియా భట్ తెలిపారు. రాజమౌళి దర్శకత్వంలో నటించడం ఒక కల అని ఆమె చెప్పారు. ఈ చిత్రం పాన్ ఇండియా మూవీగా జనవరి 7వ తేదీన రిలీజ్ అవుతుందని రామ్ చరణ్ తెలిపారు. సినిమా అనుకున్న స్థాయిలో వచ్చిందన్నారు. ఆర్ఆర్ఆర్ మూవీ 1920 కథాంశంగా రాజమౌళి తెరకెక్కించారు. రామచరణ్ అల్లూరి సీతారామరాజుగా, జూనియర్ ఎన్టీఆర్ కొమురం భీంగా నటిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ కు విశేష స్పందన లభించింది.
- Tags
- RRR
- junior ntr
Next Story

