Mon Dec 23 2024 12:42:37 GMT+0000 (Coordinated Universal Time)
జపాన్ లో RRR హవా..ప్రమోషన్స్ లో జాపనీస్ లో మాట్లాడిన ఎన్టీఆర్
ఇంటర్వ్యూలు, టీవీ షో లకు హాజరవుతూ RRR ప్రమోషన్స్ ను భారీ స్థాయిలో చేస్తున్నారు. తాజాగా తారక్ జాపనీస్ లో మాట్లాడిన వీడియో..
దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ - రామ్ చరణ్ కలిసి నటించిన సినిమా RRR. సినిమా థియేటర్లలో విడుదలై.. ఓటీటీల్లోనూ ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చినా హవా కొనసాగుతోంది. RRR ఇండియన్ ఆడియన్స్ తో పాటు ప్రపంచ సినీ సాంకేతిక నిపుణల చేత కూడా అభినందనలు అందుకుంటుంది. ప్రేక్షకాదరణ పెరగడంతో.. RRR ను ఇతర దేశాల భాషల్లోకి కూడా అనువదించి విడుదలకు సిద్ధం చేస్తున్నారు.
ఈ క్రమంలోనే జపాన్ లో శుక్రవారం జాపనీస్ భాషలో RRR సినిమా విడుదలైంది. అంతకుముందు రోజు ప్రమోషన్స్ కోసం.. RRR టీమ్ ఆ దేశానికి చేరుకుంది. ఎన్టీఆర్, రామ్ చరణ్ లు సతీసమేతంగా జపాన్ కు వెళ్లారు. మూడ్రోజులుగా ఈ హీరోలిద్దరూ.. అక్కడ ఇంటర్వ్యూలు, టీవీ షో లకు హాజరవుతూ RRR ప్రమోషన్స్ ను భారీ స్థాయిలో చేస్తున్నారు. తాజాగా తారక్ జాపనీస్ లో మాట్లాడిన వీడియో ఒకటి నెట్టింట వైరలవుతోంది. "అందరకి నమస్కారం. మీరు ఎలా ఉన్నారు. మిమ్మల్ని కలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ మూవీ చూసి ఎంజాయ్ చేయండి, థ్యాంక్యూ" అంటూ జాపనీస్ లో మాట్లాడి.. జపానులను ఆకట్టుకున్నారు. జపాన్ లో RRR తొలిరోజు షో లన్నీ హౌస్ ఫుల్ అవడం విశేషం.
Next Story