శ్రీరామ్ మొదటిసారి స్టార్ హీరోకి పాడాడు
సౌత్ ఇండియాలో మోస్ట్ వాంటెడ్ సింగర్ గా మారాడు సిద్ శ్రీరామ్. అతని వాయిస్ లో ఏదో తెలియని మేజిక్ ఉంది. ఆ గొంతు వింటే చాలు [more]
సౌత్ ఇండియాలో మోస్ట్ వాంటెడ్ సింగర్ గా మారాడు సిద్ శ్రీరామ్. అతని వాయిస్ లో ఏదో తెలియని మేజిక్ ఉంది. ఆ గొంతు వింటే చాలు [more]
సౌత్ ఇండియాలో మోస్ట్ వాంటెడ్ సింగర్ గా మారాడు సిద్ శ్రీరామ్. అతని వాయిస్ లో ఏదో తెలియని మేజిక్ ఉంది. ఆ గొంతు వింటే చాలు ఒళ్ళు పులకరిస్తుంది. అటువంటి వాయిస్ తో ప్రస్తుతం సౌత్ ఇండియా ని ఏలేస్తున్న శ్రీరామ్ తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళం భాషల్లో పాటలు పాడుతూ ఫుల్ బిజీగా మారాడు.
బంపర్ హిట్టే….
తెలుగులో ‘అడిగా అడిగా’.. ‘ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే’.. ‘అందం అమ్మాయైతే’, ‘మాటే వినదుగా’ ఇలా ఇతను పాడిన సాంగ్స్ అన్ని బంపర్ హిట్టే . యూట్యూబ్ లో ఇతను పాడిన సాంగ్స్ కి కోట్లల్లో వ్యూస్ వస్తున్నాయి. సౌత్ లో సిద్ ను కొట్టేవారు లేరు అంటే అతిశయోక్తి కాదు. తెలుగులో మనోడు యంగ్ హీరోస్ కి మాత్రమే పాడాడు. స్టార్ హీరోస్ కి పాడలేదు. విజయ్, నాని లాంటి టైర్-2 హీరోలకే పరిమితం అవుతున్న సిద్‌తో పెద్ద హీరోలెవ్వరూ పాటలు పాడించుకోలేరు. బహుశా ఇతని వాయిస్ వారికి సెట్ అవ్వదు అని పాడించుకోలేదేమో?
సామజవరగమన…
తాజాగా అల్లు అర్జున్ తన సినిమాలో పాడించుకున్నాడు. త్రివిక్రమ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ‘అల వైకుంఠపురములో..’ సినిమాలో సిద్ ఒక పాట పాడాడు. ‘సామజవరగమన..’ పేరుతో ఈ పాట టీజర్‌ను గురువారం సాయంత్రం లాంచ్ చేశారు. ప్రోమో చాలా బాగుంది. మరి పాట ఎలా ఉంటుందో చూడాలి. త్వరలోనే ఫస్ట్ సింగల్ ని రిలీజ్ చేయనున్నారు.