Fri Apr 04 2025 12:00:25 GMT+0000 (Coordinated Universal Time)
నేడు షూటింగులు బంద్.. 11 గంటలకు అంత్యక్రియలు
తెలుగు రాష్ట్రాల సీఎంలు సహా.. సినీ, రాజకీయ ప్రముఖులు విశ్వనాథ్ మరణం పట్ల నివాళులు అర్పిస్తున్నారు. సినిమా కోసం..

ప్రముఖ దర్శకుడు, కళాతపస్వి కె.విశ్వనాథ్ గతరాత్రి 11 గంటల సమయంలో అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన మృతికి సంతాపంగా నేడు షూటింగ్ లను నిలిపివేస్తున్నట్లు టాలీవుడ్ తెలిపింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. విశ్వనాథ్ భౌతిక కాయానికి నివాళులు అర్పించేందుకు, ఆయన చివరి చూపు కోసం సినీ ప్రముఖులు ఆయన నివాసానికి చేరుకుంటున్నారు.
కాగా.. ఈరోజు ఉదయం 11 గంటలకు విశ్వనాథ్ అంతిమయాత్ర ప్రారంభమవుతుందని, పంజాగుట్ట స్మశాన వాటికలో విశ్వనాథ్ భౌతిక కాయానికి అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు నటుడు ఏడిద రాజా తెలిపారు. తెలుగు రాష్ట్రాల సీఎంలు సహా.. సినీ, రాజకీయ ప్రముఖులు విశ్వనాథ్ మరణం పట్ల నివాళులు అర్పిస్తున్నారు. సినిమా కోసం పరితపించిన ఆయన లాంటి మనిషి మరొకరు ఇండస్ట్రీలో లేరు ఉండరంటూ కన్నీటి పర్యంతమవుతున్నారు. ఆయన తీసిన సాంస్కృతిక సినిమాల వంటి.. ఎవర్ గ్రీన్, ఐకానిక్ సినిమాలు తీయడం ఎవరికీ సాధ్యం కాదంటూ.. ఆయన సినిమాలను గుర్తుచేసుకుంటున్నారు.
Next Story