ధనుష్ అత్యాశే... కొంప ముంచిందా..?
రజనీకాంత్ ని హీరోగా పెట్టి సినిమా తీసి బాగా లాభపడదామని కలలు కన్న ధనుష్ కి చివరికి మిగిలింది ఏంటి? అంటే.. కాలా తో ధనుష్ కి నష్టాలూ తప్పేలా లేవంటున్నాయి ట్రేడ్ వర్గాలు. రజనీకాంత్ కి ఉన్న క్రేజ్ తో కాలా సినిమాని విడుదల చేద్దామనుకున్న ధనుష్ కి కాలా షాకిచ్చింది. కబాలి సినిమా ఫ్లాప్ తో కాలా సినిమాకి ఎక్కువ కోడ్ చెయ్యడానికి డిస్ట్రిబ్యూటర్స్ బాగా ఆలోచించారు. తెలుగులో శాటిలైట్ హక్కులతో పాటుగా థియేటరికల్ రైట్స్ కి 30 కోట్లిస్తామని ముందుకు వచ్చినప్పటికీ.. ధనుష్ మాత్రం థియేట్రికల్ రైట్స్ కె 30 కోట్లు డిమాండ్ చెయ్యడంతో.. డిస్ట్రిబ్యూటర్స్ కాలా సినిమాని ధనుష్ కే వదిలేశారు. దాంతో ధనుష్ కాలా మీద కాన్ఫిడెన్స్ తో పెద్దగా ప్రమోషన్ లేకుండా విడుదల చేసాడు.
గురువారం విడుదల చేయడమే దెబ్బతీసింది...
కానీ కాలా కి మొదటిరోజు కనీసం కబాలి కొచ్చిన కలెక్షన్స్ లో సగం కూడా రాలేదు. అసలు కాలా సినిమాకి కావాల్సిన మార్కెటింగ్ జరగకపోవడం, అలాగే లోకల్ డిస్ట్రిబ్యూటర్స్ లేకపోవడంతో కాలా రిలీజ్ అవుతోందనే సంగతి కూడా చాలామందికి తెలియదు. అందుకే ఎప్పుడు రజనీకాంత్ సినిమాకి మామూలుగా వచ్చే ఓపెనింగ్స్ కూడా కాలా దక్కించుకోలేదు. మరి గురువారం సినిమా విడుదలవడం కూడా కాలా కష్టాలు పెరగడానికి కారణమయ్యింది. మాములుగా శుక్రవారం సినిమా విడుదలైతే.... శని, ఆది వారాలు సినిమా టికెట్స్ ఫుల్ గా బుక్ అయ్యేవి. కానీ గురువారం సినిమా విడుదల కావడం.. శుక్రవారం ఆఫీస్ లు ఉండడంతో.. సినిమా టాక్ చూసి సినిమాకెళదామనుకున్నవారికి కాలా యావరేజ్ టాక్ రావడంతో... ఈ వారాంతంలో కాలా కి వెళ్లేవాళ్ల సంఖ్య అంతంతమాత్రంగానే ఉంది. అంటే ఆన్ లైన్ లో ఎప్పుడుకావాలంటే అప్పుడు టికెట్స్ దొరికేస్తున్నాయి.
ధనుష్ తప్పుచేశాడా..?
మరి గురువారం సినిమా విడుదలై... ఆ రోజు కలెక్షన్స్ రాకపోగా.. శుక్రవారం కూడా కాలా వసూళ్లు అంతంతమాత్రంగానే ఉన్నాయి. ఇక ధనుష్ అత్యాశకు పోయి.. కాలా ఫలితాన్ని సరిగ్గా అంచనా వెయ్యలేకపోయాడు. శని, ఆది వారాల్లో కాలా పరిస్థితి ఎలా వున్నా సోమవారం నాటికీ కాలా పరిస్థితి ఘోరంగా తయారవుతుందని.. ధనుష్ మంచి రేట్ వచ్చినప్పుడు బిజినెస్ క్లోజ్ చెయ్యాల్సింది... థియేటర్స్ నుంచి తెలుగు కాలా కి వచ్చే షేర్ 10 నుండి 12 కోట్లు మించదని.. ఈ విధంగా శాటిలైట్ హక్కులతో కలిపి 30 కి అమ్మెయ్యాల్సిందని.. అలా అమ్మేస్తే 15 కోట్ల నష్టాన్ని తప్పించుకోగలిగే వాడని ఫిలింనగర్ లో గుసగుసలు వినబడుతున్నాయి.