Mon Dec 23 2024 07:05:23 GMT+0000 (Coordinated Universal Time)
డ్రగ్స్ కేసు : సినీ నిర్మాత అరెస్ట్
కేపీ చౌదరి కొంతకాలంగా గోవాలో ఉంటున్నట్లు తెలిసింది. కొంతకాలం క్రితం తెలుగు రాష్ట్రాల్లో డ్రగ్స్ కేసు ఏ స్థాయిలో కలకలం..
సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో మరోసారి డ్రగ్స్ దందా కలకలం రేపింది. డ్రగ్స్ సప్లై చేస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. వీరి నుంచి పెద్ద ఎత్తున మాదకద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ వినియోగిస్తున్న సినీ నిర్మాత కేపీ చౌదరిని పోలీసులు అరెస్ట్ చేశారు. కేపీ చౌదరి కబాలి సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు. ఆయన డ్రగ్స్ వాడుతున్నట్లు తేలడంతో సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసి, ఆయన నుండి కొకైన్ ను స్వాధీనం చేసుకున్నారు.
కేపీ చౌదరి కొంతకాలంగా గోవాలో ఉంటున్నట్లు తెలిసింది. కొంతకాలం క్రితం తెలుగు రాష్ట్రాల్లో డ్రగ్స్ కేసు ఏ స్థాయిలో కలకలం సృష్టించిందో తెలిసిందే. సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తుల పేర్లు ఈ కేసులో వినిపించాయి. వారందరినీ పోలీసులు విచారణ కూడా చేశారు. పూరీ జగన్నాథ్, ఛార్మి, నవదీప్, రవితేజ, తరుణ్, సుబ్బరాజు, నందు, తనీష్ సహా పలువురు ప్రముఖులను ఈడీ విచారించింది. ఫోరెన్సిక్ నివేదికలో వారు డ్రగ్స్ వాడలేదని రావడంతో అందరికీ క్లీన్ చిట్ ఇచ్చింది. తాజాగా నిర్మాత కేపీ చౌదరి డ్రగ్స్ కేసులో అరెస్ట్ సంచలనం రేపింది.
Next Story