మరీ ఇంత దిగజారిపోవాలా?
నేనే రాజు నేనే మంత్రి సినిమా కు ముందు కాజల్ అగర్వాల్ కెరీర్ ముగిసిపోయింది.. అంటూ ప్రచారం జరిగింది. కానీ ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమా [more]
నేనే రాజు నేనే మంత్రి సినిమా కు ముందు కాజల్ అగర్వాల్ కెరీర్ ముగిసిపోయింది.. అంటూ ప్రచారం జరిగింది. కానీ ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమా [more]
నేనే రాజు నేనే మంత్రి సినిమా కు ముందు కాజల్ అగర్వాల్ కెరీర్ ముగిసిపోయింది.. అంటూ ప్రచారం జరిగింది. కానీ ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమా హిట్ అవడంతో కాజల్ మళ్ళీ పుంజుకుంది అని అనుకున్నారు. ఆ ఊపులోనే భారీ రెమ్యునరేషన్ కి బెల్లంకొండ శ్రీనివాస్ తో ‘కవచం’ సినిమా చేసింది. అది అట్టర్ ప్లాప్. తర్వాత మళ్ళీ తానే లీడింగ్ పాత్రలో ‘సీత’ సినిమాలో నటించింది. తేజ దర్శకత్వంలో వచ్చిన ‘సీత’ సినిమా కూడా ప్లాప్ అయ్యింది. ఇక ‘సీత’ సినిమా కన్నా ముందుగానే శర్వానంద్ కి జోడిగా ‘రణరంగం’ సినిమాకి సైన్ చేసింది. ‘రణరంగం’లో కాజల్ అగర్వాల్ మెయిన్ హీరోయిన్ కాగా.. కళ్యాణి ప్రియదర్శిని సెకండ్ హీరోయిన్. ఇక గ్లామర్ తో ‘రణరంగం’ లో కాజల్ పాత్ర అదిరిపోయిద్ది అనే అనుకున్నారు.
కానీ ‘రణరంగం’ సినిమా చూసాక కాజల్ అగర్వాల్ ఇలాంటి పాత్రలకి దిగజారిపోతుందా? అని అనిపించక మానదు. ఎందుకంటే ‘రణరంగంలో’ కాజల్ ఎలాంటి పాత్ర చేసిందో సినిమా చూసిన వారికి అర్ధమవుతుంది. అస్సలు ఎలాంటి ప్రాధాన్యత లేని ఓ పాత్రలో కాజల్ కనిపించింది. కనీసం సెకండ్ హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శన్ కి ఉన్న ప్రాధాన్యత కూడా కాజల్ కి లేకపోయింది. అమె కొచ్చిన పేరు కూడా కాజల్ అగర్వాల్ కి రాలేదు. మరి కెరీర్ లో మంచి అవకాశాలు లేకపోయినా… చిన్నా చితక సినిమాల్తో బిజీగా గడిపేస్తున్న కాజల్ కి ఈ ‘రణరంగం’ ఏ విధంగా హెల్ప్ చెయ్యలేదు. అయితే కాజల్ ఇలాంటి పాత్రలు ఎందుకు ఒప్పుకుంటుందో అని చూస్తే.. కెరీర్ అవసాన దశలో ఉన్నప్పుడు ఏ పాత్ర అయితే ఏమైంది అన్నట్టుగా ఉంది కాజల్ వాలకం. అయితే కాజల్ కి కథ చెప్పినప్పుడు మంచి పాత్రే అంటే… కాస్త నిడివి ఉన్న పాత్రే ఇచ్చారట. కానీ ఎడిటింగ్ లో కాజల్ సీన్స్ కావాలనే లేపేశామని ‘రణరంగం’ హీరో శర్వానంద్ చెప్పడం ఇక్కడ కొసమెరుపు.