Sun Dec 22 2024 21:55:34 GMT+0000 (Coordinated Universal Time)
కాజల్.. అతి త్వరలో..!
గత కొన్ని రోజులుగా, కాజల్ అగర్వాల్ భారతీయుడు 2 లో భాగం కాదని
కాజల్ అగర్వాల్ ఏప్రిల్ 2022లో మగబిడ్డకు జన్మనిచ్చింది. నీల్ కిచ్లూ అని ఆ పిల్లాడికి పేరు పెట్టింది. 2021లో గర్భవతి అయినప్పటి నుండి సినిమాలకు విరామం తీసుకుంది. కాజల్ ఇప్పుడు తిరిగి నటించడానికి సిద్ధంగా ఉంది. నేహా ధూపియాతో ఇన్స్టాగ్రామ్ లైవ్ సెషన్లో, కాజల్ అగర్వాల్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న కమల్ హాసన్ ఇండియన్ 2లో తాను ఇప్పటికీ భాగమేనని ధృవీకరించింది. ఈ సినిమా షూటింగ్‌ని ఎప్పుడు ప్రారంభించనున్నారో కూడా ఆమె వెల్లడించింది.
సెప్టెంబర్ 13 నుంచి కమలహాసన్ కు చెందిన ఇండియన్ 2 సినిమాతో షూటింగ్ మొదలు పెట్టనున్నట్టు కాజల్ వెల్లడించింది. సెట్స్ లో ప్రమాదం వల్ల ముగ్గురు టెక్నీషియన్లు మరణించడంతో రెండేళ్లుగా నిలిచిపోయిన శంకర్ సినిమా మళ్లీ మొదలు కానుందని తెలుస్తోంది. మళ్లీ సినిమాల్లో నటించనున్నట్టు కాజల్ చేసిన ప్రకటన అభిమానులకు సంతోషాన్నిస్తోంది. 1996లో వచ్చిన ఇండియన్ (తెలుగులో భారతీయుడు) సినిమాకు సీక్వెల్ గా రూపొందుతున్నదే ఇండియన్ 2. ఈ సినిమా 60 శాతం వరకు షూటింగ్ పూర్తి చేసుకుంది. కాజల్ అగర్వాల్ చివరిగా 'హే సినామిక' సినిమాలో నటించింది.
గత కొన్ని రోజులుగా, కాజల్ అగర్వాల్ భారతీయుడు 2 లో భాగం కాదని పుకార్లు వ్యాపించాయి. కాజల్ కొన్ని నెలల క్రితం ఒక కొడుకుకు జన్మనిచ్చింది కాబట్టి, మేకర్స్ మరో హీరోయిన్ కోసం వెతుకుతున్నట్లు సమాచారం. ఈ రూమర్స్ కి కాజల్ సమాధానం ఇచ్చింది. భారతీయుడు 2 విషయంలో శంకర్, లైకా ప్రొడక్షన్స్ మధ్య అనేక సమస్యల కారణంగా విభేదాలు వచ్చాయి. ఇటీవల ఆ సమస్యలు సద్దుమణిగినట్లు సమాచారం. కాజల్ అగర్వాల్, సిద్ధార్థ్, ప్రియా భవానీ శంకర్ లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.
News Summary - Kajal Aggarwal to return to work after pregnancy
Next Story