Sun Dec 22 2024 16:48:27 GMT+0000 (Coordinated Universal Time)
పుష్ప2 లో కాజల్ స్పెషల్ సాంగ్ ?
ఇక పుష్ప కి మ్యూజిక్ అందించిన దేవిశ్రీ ప్రసాద్ పుష్ప-2 కి కూడా సంగీతాన్ని అందిస్తున్నాడు. పుష్పకి మించిన సాంగ్స్ పుష్ప 2 కి
టాలీవుడ్ ని సుదీర్ఘకాలం పాటు ఏలేసిన అగ్ర కథానాయికలలో కాజల్ అగర్వాల్ కూడా ఒకరు. పెళ్లి, ప్రెగ్నెసీ కారణాలతో కొంతకాలం ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఈ ముద్దుగుమ్మ.. మళ్లీ టాలీవుడ్ లోకి రీఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. తాజాగా అందుకు సంబంధించిన ఓ అప్డేట్ వచ్చింది. పుష్ప ది రైజ్ లో సమంత స్పెషల్ సాంగ్ లో చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు పుష్ప-2 లో స్పెషల్ సాంగ్ చేసేందుకు దర్శకుడు సుకుమార్ ఆమెను సంప్రదించడం.. అందుకు కాజల్ ఓకే చెప్పేయడం కూడా జరిగిపోయాయట.
ఇక పుష్ప కి మ్యూజిక్ అందించిన దేవిశ్రీ ప్రసాద్ పుష్ప-2 కి కూడా సంగీతాన్ని అందిస్తున్నాడు. పుష్పకి మించిన సాంగ్స్ పుష్ప 2 కి అందించగా.. ఐటమ్ సాంగ్ అంతకుమించి ఉంటుందని సమాచారం. ఇప్పుడు ఆ సాంగ్ కే కాజల్ ను సెలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. గతంలో 'జనతా గ్యారేజ్' సినిమాకి కాజల్ ఐటమ్ 'నేను పక్కా లోకల్' ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆ ఒక్క పాటకి ఆమె కోటి రూపాయలు తీసుకున్నట్టుగా వార్తలు వచ్చాయి. మరి పుష్ప 2 లో స్పెషల్ సాంగ్ కి కోటికి పైగా రెమ్యునరేషన్ తీసుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Next Story