Fri Nov 22 2024 01:18:00 GMT+0000 (Coordinated Universal Time)
Deepfake Video : కాజోల్ డీప్‌ఫేక్ వీడియో.. రష్మిక మాజీ ప్రియుడు కామెంట్స్..
డీప్‌ఫేక్ వీడియోతో ఈసారి కాజోల్‌కి సమస్య. రష్మిక మాజీ ప్రియుడు రక్షిత్ శెట్టి రియాక్ట్ అవుతూ..
AI టెక్నాలజీ వచ్చిన దగ్గర నుంచి సాధారణ ప్రజలకు కూడా ఆధునిక టెక్నాలజీ అందుబాటులో ఉంటుంది. ఈ టెక్నాలజీ ఉపయోగించి కొందరు అద్భుతాలు సృష్టిస్తుంటే, మరికొంతమంది మాత్రం.. దానిని తప్పుడు పద్ధతిలో ఉపయోగించి ఇతరులకు సమస్యలు తెచ్చి పెడుతున్నారు. ఈక్రమంలోనే ఇటీవల హీరోయిన్ రష్మిక డీప్‌ఫేక్ వీడియో సమస్యని ఎదుర్కొన్నారు. ఎవరో ఒక అమ్మాయి వీడియోకి రష్మిక పేస్ పెట్టి మార్ఫ్ చేశారు.
ఆ వీడియో దేశంలో పెద్ద చర్చినీయాంశంగా మారింది. మార్ఫింగ్ వంటి ఆగడాలు వల్ల ఆడవారికి సమస్య పొంచి ఉంది, అలాంటి వాటిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలంటూ సినీ, రాజకీయ ప్రముఖుల సైతం గవర్నమెంట్ కోరుతూ వచ్చారు. దీంతో భారత ప్రభుత్వం సోషల్ మీడియా ప్లాట్ఫార్మ్స్ కొత్త రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని తీసుకొచ్చింది. వాటిని అతిక్రమిస్తే జైలు శిక్ష మరియు జరిమానా విధించబడుతుందంటూ ప్రకటించినప్పటికీ.. ఆ ఆగడాలు తగ్గడం లేదు.
తాజాగా ఈ సమస్య బాలీవుడ్ హీరోయిన్ కాజోల్ కి ఎదురైంది. ఇన్నర్ వెర్స్ తో ఉన్న ఒక అమ్మాయి తన అవుట్ ఫిట్స్ ని మార్చుకుంటున్న వీడియోకి కాజోల్ పేస్ ని మార్ఫ్ చేశారు. ఇక రష్మిక సంఘటనతో ఇలాంటి వాటి పై తక్షణ చర్యలు చేపడుతున్న సైబర్ డిపార్ట్మెంట్.. వెంటనే ఆ వీడియోని తొలిగించే ప్రయత్నం చేశారు. దీంతో అది ఎక్కువ వ్యాప్తి చెందకుండా ఆపగలిగారు. కాగా ఒరిజినల్ వీడియోలో ఉన్నది ఓ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అని తెలుస్తుంది.
ఇక ఇలాంటి పనులు పై రష్మిక మాజీ ప్రియుడు రక్షిత్ శెట్టి రియాక్ట్ అయ్యారు. "ఇలాంటి మార్ఫింగ్ సాఫ్ట్వేర్స్ అని ప్రస్తుతం అందరికి అందుబాటులో ఉంటున్నాయి. ముందు వాటిని అరికట్టాలి. లైసెన్స్ ఉన్న సాఫ్ట్వేర్స్ ఉపయోగించేలా రూల్ తీసుకు రావాలని" రక్షిత్ చెప్పుకొచ్చారు. ఇక కొంతమంది నెటిజెన్స్.. ఇలాంటి సాఫ్ట్వేర్స్ తో పాటు సోషల్ మీడియాలో విచక్షణారహితంగా ప్రవర్తిస్తున్న సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ పై కూడా చర్యలు చేపట్టాలి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Next Story