'కాలా' చిత్తాన్ని పెద్ద సమస్య వచ్చిపడింది
రజినీకాంత్ నటించిన 'కాలా' చిత్రం వచ్చే శుక్రవారం రిలీజ్ కు రెడీ గా ఉన్న సమయంలో పెద్ద సమస్య ఎదురైంది. ఈ చిత్రంలో రజిని ముంబై మురికివాడలో నివాసముండే తమిళుల కోసం పోరాడే వ్యక్తిగా నటించినట్లు తెలుస్తోంది. ట్రైలర్ చూస్తే మనకి అర్ధం అవుతుంది. కానీ చిత్ర యూనిట్ రజిని పాత్ర ఎలా ఉంటుందో బయటకి చెప్పలేదు.
అయితే ఈ చిత్ర కాన్సెప్ట్ తన తండ్రి ఎస్. తిరువియం నాడార్ కథ ఆధారంగా తెరకెక్కిందని జవహర్ అనే వ్యక్తి ఆరోపిస్తున్నారు. అంతే కాదు రజినీపై 100 కోట్లు పరువు నష్టం దావా వేస్తూ నోటీసులు పంపినట్లు సమాచారం. రీసెంట్ గా జవహర్ ఓ డైలీ పేపర్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇలా చెప్పాడు...తన తండ్రి కథ ఆధారంగానే కాలా చిత్రంని తెరకెక్కించారని.. ఆ చిత్ర దర్శకుడు పా.రంజిత్ని కలిసేందుకు ప్రయత్నించానని చెప్పారు.
సినిమా విడుదల అయ్యాక నిజంగానే తన తండ్రి కథలానే ఉంటె నేను వారిని ఊరికే వదిలిపెట్టనని స్పష్టం చేశారు. తమ ఫ్యామిలీని సంప్రదించకుండా ఈ సినిమాను తెరకెక్కించడం సరికాదని వెల్లడించారు. కేవలం రాజకీయ లబ్ధికోసమే ఈ చిత్రాన్ని తీసారని ఆయన వెల్లడించారు