Mon Dec 23 2024 02:59:42 GMT+0000 (Coordinated Universal Time)
కళావతి ఒరిజినల్ సాంగ్.. మహేష్ - కీర్తి కెమిస్ట్రీ సూపర్ !
మహేష్ - కీర్తి ల మధ్య కెమిస్ట్రీ చక్కగా కుదిరింది. వందో.. ఒక వెయ్యో అంటూ సాగే ఈ మెలోడి సాంగ్ శ్రోతలను ఆకట్టుకుంటుంది.
పరశురామ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు - కీర్తి సురేష్ జంటగా తెరకెక్కిన తాజా చిత్రం సర్కారువారి పాట. ఈ సినిమా కోసం మహేష్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, వీడియోలు మంచి హైప్ ను క్రియేట్ చేశాయి. అలాగే కళావతి సాంగ్ ప్రోమో కు కూడా ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. సంగీత దర్శకుడు ఎస్ఎస్ తమన్ స్వరపరిచిన ఆ పాట ఒరిజినల్ లిరికల్ వీడియో విడుదలైంది.
ఈ వీడియోలో మహేష్ - కీర్తి ల మధ్య కెమిస్ట్రీ చక్కగా కుదిరింది. వందో.. ఒక వెయ్యో అంటూ సాగే ఈ మెలోడి సాంగ్ శ్రోతలను ఆకట్టుకుంటుంది. చాలా సింపుల్ గా ఉండే మహేష్.. ఈ పాటలో మాత్రం చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. అనంత శ్రీరామ్ రచించిన ఈ పాటను ప్రముఖ సింగర్ సిధ్ శ్రీరామ్ ఆలపించారు. సిధ్ పాట పాడాడు అంటే.. అది ఖచ్చితంగా హిట్ అవ్వాల్సిందే. కాగా.. తొలుత ఈ పాటను ఫిబ్రవరి 14 వాలెంటైన్స్ డే సందర్భంగా విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావించింది. ఆ మేరకే ప్రకటన చేసింది. కానీ.. అనూహ్యంగా శనివారం సాయంత్రం కళావతి ఫుల్ సాంగ్ సోషల్ మీడియాలో లీక్ అయి.. చిత్ర యూనిట్ కు షాకిచ్చింది. దాంతో ఒకరోజు ముందుగానే పాటను విడుదల చేశారు మేకర్స్. మే 12వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదలయ్యేందుకు సన్నద్ధమవుతోంది.
News Summary - Kalavathi Full Song Lyrical Video Out from Sarkaruvari Pata
Next Story