Thu Dec 19 2024 23:36:17 GMT+0000 (Coordinated Universal Time)
Prabhas : సర్జరీ చేయించుకున్నా.. ప్రభాస్కి మోకాలి గాయం తగ్గలేదా..
సర్జరీ చేయించుకున్నా ప్రభాస్కి మోకాలి గాయం తగ్గలేదా. ప్రభాస్ కి సంబంధించిన తాజా ఫోటో ఒకటి చూస్తుంటే..
Prabhas : బాహుబలి సినిమా నుంచి భారీ సినిమాలు చేస్తూ వస్తున్న ప్రభాస్.. గత ఏడేళ్లుగా మోకాలి సమస్యతో బాధపడుతూ వస్తున్నారు. బాహుబలి మూవీలోని యాక్షన్ సీన్స్ కోసం ప్రభాస్ నెలలు తరబడి కష్టపడిన సంగతి తెలిసిందే. ఆ సమయంలోనే ప్రభాస్ మోకాలి సమస్యని ఎదుర్కొన్నారు. ఇక అప్పటినుంచి ప్రభాస్ ని ఆ సమస్య ఇబ్బంది పెడుతూనే వచ్చింది. అయితే ప్రభాస్ ఆ సమస్యకి దీర్ఘకాలిక చికిత్స తీసుకోకుండా.. తాత్కాలిక చికిత్సతో సాహూ, రాధే శ్యామ్, ఆదిపురుష్, సలార్ షూటింగ్ పూర్తి చేస్తూ వచ్చారు.
అయితే ఆ సమస్య మరింత తీవ్రతరం అవ్వడంతో.. గత ఏడాది సెప్టెంబర్ లో శాస్త్రీయ చికిత్స కోసం యూరప్ వెళ్లారు. ఇక ఎట్టకేలకు సర్జరీ చేయించుకున్న ప్రభాస్.. అక్కడే నెలరోజుల పాటు డాక్టర్స్ పర్యవేక్షణలో రెస్ట్ తీసుకోని వచ్చారు. నెలరోజుల తరువాత ఇండియా వచ్చిన ప్రభాస్ ని ఎనర్జీగా చూసి.. మోకాలి సమస్య విడిపోయిందని అందరూ అనుకున్నారు. కానీ ప్రభాస్ కి సంబంధించిన తాజా ఫోటో ఒకటి చూస్తుంటే.. డార్లింగ్ ని ఇంకా ఆ మోకాలి సమస్య వదిలినట్లు లేదు అనిపిస్తుంది.
ప్రభాస్ ప్రస్తుతం 'కల్కి 2898 AD' మూవీ షూటింగ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ మూవీలోని ఓ రొమాంటిక్ సాంగ్ ని ప్రభాస్ అండ్ దిశా పటాని పై ఇటలీలో తెరకెక్కిస్తున్నారు. ఆ షూటింగ్ కి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట బయటపడుతూ వైరల్ అవుతున్నాయి. ఈక్రమంలోనే తాజాగా ప్రభాస్ ఫ్లైట్ దిగుతున్న ఓ ఫోటో బయటకి వచ్చింది. ఆ పిక్ లో ఫ్లైట్ దిగేందుకు ప్రభాస్ ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తుంది.
రెండు చేతులతో పక్కన ఉన్న సపోర్టర్స్ ని పట్టుకొని చాలా జాగ్రత్తగా ప్రభాస్ కిందకి దిగుతున్నారు. ఇక ఈ ఫోటోని చూసిన ప్రభాస్ ఫ్యాన్స్.. 'డార్లింగ్ ఇంకా మోకాలి సమస్య తగ్గినట్లు లేదు అనుకుంటా' అంటూ కామెంట్స్ చేస్తూ వస్తున్నారు. కాగా ఈ మోకాలి సమస్య తగ్గడం కోసం ప్రభాస్ కొంచెం ఎక్కువ కాలమే రెస్ట్ తీసుకోవాల్సి ఉందట. కానీ ఫ్యాన్స్ మరియు నిర్మాతల కోసం త్వరగానే షూటింగ్స్ కి వచ్చేసారు.
Next Story