Mon Dec 23 2024 18:21:10 GMT+0000 (Coordinated Universal Time)
ఐ మిస్ మై డాటర్స్ .. వైరల్ అవుతోన్న కల్యాణ్ దేవ్ పోస్ట్
తాజాగా కల్యాణ్ దేవ్ తన కూతుర్లను చాలా మిస్ అవుతున్నానంటూ పెట్టిన పోస్ట్ వైరల్ అయింది. కల్యాణ్ దేవ్ చేసిన ఆ పోస్ట్ లో..
కొంతకాలంగా మెగాస్టార్ చిరంజీవి చిన్నకూతురు శ్రీజ, అల్లుడు కల్యాణ్ దేవ్ ల మధ్య మనస్ఫర్థలు ఏర్పడ్డాయని, వారిద్దరూ విడిపోయారంటూ వార్తలు వైరల్ అయ్యాయి. అందుకు తగ్గట్టుగానే ఇద్దరూ విడివిడిగా ఉంటున్నారు. ఒకరినొకరు సోషల్ మీడియా ఫ్లాట్ పామ్స్ లో అన్ ఫాలో చేసుకోవడంతో పాటు.. శ్రీజ తన ఐడీ లో శ్రీజ కల్యాణ్ ను శ్రీజ కొణిదెలగా మార్చడంతో ఆ వార్తలకు మరింత బలం చేకూరింది. కొద్దిరోజులుగా వీరిద్దరూ ఏం పోస్ట్ చేసినా అవి క్షణాల్లోనే వైరల్ అవుతున్నాయి.
తాజాగా కల్యాణ్ దేవ్ తన కూతుర్లను చాలా మిస్ అవుతున్నానంటూ పెట్టిన పోస్ట్ వైరల్ అయింది. కల్యాణ్ దేవ్ చేసిన ఆ పోస్ట్ లో.. ఓ స్కూల్ పాప కల్చరల్ ఈవెంట్లో పాల్గొంటుంది. స్టేజీపై నిలబడిన పాప.. తన పేరెంట్స్ ఎక్కడున్నారా అని వెతుక్కుంటూ.. వాళ్లు కనిపించగానే సంతోషంతో ఎగ్జైట్ అవుతుంది. ఈ వీడియోను కల్యాణ్ దేవ్ తన ఇన్ స్టా స్టోరీస్ లో షేర్ చేసి.. పిల్లలకు తల్లిదండ్రుల ప్రేమ, సపోర్ట్ కావాలి. మిస్ యు నవిష్క, నివ్రితి అని రాశాడు. భార్యభర్తలుగా విడిపోయినా.. పిల్లలకు తల్లిదండ్రులుగా ఉండాలని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
Next Story