Mon Dec 23 2024 01:44:43 GMT+0000 (Coordinated Universal Time)
తమ్ముడికి అదిరిపోయే బర్త్ డే గిఫ్ట్ ఇచ్చిన అన్న.. దేవర గా ఎన్టీఆర్ లుక్ అరాచకం
ఫస్ట్ లుక్ పోస్టర్ అభిమానుల అంచనాలకు మించి ఉండటంతో.. ఫ్యాన్స్ చాలా ఖుషీగా ఉన్నారు. ఒంటినిండా రక్తం, చేతిలో కత్తితో..
నందమూరి కల్యాణ్ రామ్..ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కొరటాల శివ దర్శకత్వంలో నిర్మిస్తోన్న చిత్రం NTR30. ఆర్ఆర్ఆర్ వంటి పాన్ ఇండియా సినిమా తర్వాత నటిస్తోన్న సినిమా కావడంతో.. సినిమాపై భారీ అంచనాలున్నాయి. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. NTR30 వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ ని ఎన్టీఆర్ పుట్టినరోజు కానుకగా నేడు (మే 19) రిలీజ్ చేశారు.
ఫస్ట్ లుక్ పోస్టర్ అభిమానుల అంచనాలకు మించి ఉండటంతో.. ఫ్యాన్స్ చాలా ఖుషీగా ఉన్నారు. ఒంటినిండా రక్తం, చేతిలో కత్తితో.. ఫస్ట్ లుక్ తోనే దడపుట్టించేలా ఉన్నాడు ఎన్టీఆర్. ఈ సినిమాలో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. పెద్ద ఎన్టీఆర్ స్మగ్లర్ రోల్ చేస్తున్నట్లు సమాచారం. విలన్, అతని అనుచరులు అతడిని చంపగా.. తండ్రిని చంపిన వారిపై రివేంజ్ తీర్చుకునేందుకు కొడుకు పాత్రలో వస్తాడు మరో ఎన్టీఆర్. స్టోరీ లైన్ రొటీన్ గానే అనిపించినా.. టేకింగ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ సినిమాకు దేవర అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. 2024 ఏప్రిల్ 5న ప్రపంచ వ్యాప్తంగా దేవరను విడుదల చేస్తున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది.
Next Story