Mon Dec 23 2024 02:09:47 GMT+0000 (Coordinated Universal Time)
Kalyan Ram : ఫ్యామిలీ అంటే నేను తారక్ మాత్రమే.. కళ్యాణ్ రామ్ కామెంట్స్
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు గురించి కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ.. ఫ్యామిలీ అంటే నేను నా తారక్ మాత్రమే అంటూ వైరల్ కామెంట్స్..
Kalyan Ram : కళ్యాణ్ రామ్ నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ 'డెవిల్'.. ఈ శుక్రవారం రిలీజ్ కాబోతుంది. ఇక ఈ మూవీ ప్రమోషన్స్ లో ఉన్న కళ్యాణ్ రామ్ పలు ఇంటర్వ్యూలు ఇస్తూ వస్తున్నారు. ఈక్రమంలోనే తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కళ్యాణ్ రామ్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు గురించి మాట్లాడుతూ.. ఫ్యామిలీ అంటే నేను నా తమ్ముడు తారక్ మాత్రమే అంటూ వైరల్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
అసలు విషయం ఏంటంటే, యూట్యూబ్ ఇంటర్వ్యూలో విలేకరి కళ్యాణ్ రామ్ ని ప్రశ్నిస్తూ.. "2024లో ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటివరకు కనివిని ఎరగని ఎన్నికలు జరగబోతున్నాయి. నందమూరి తారకరామారావు గారు ఉన్న సమయంలో కూడా అలాంటి ఎన్నికలు జరగలేదు. ఒక పెద్ద ఫైట్ ని ప్రజలు చూడబోతున్నారు. మీరు కూడా అలా చూస్తూనే ఉంటారా..? లేదా ఎటైనా సపోర్ట్ చేస్తారా..?" అని ప్రశ్నించారు.
దీనికి కళ్యాణ్ రామ్ బదులిస్తూ.. "సినిమా వేరు, రాజకీయం వేరు. పాలిటిక్స్ అనేది ఒక బాల్ గేమ్ లాంటిది. దానిలో కేవలం కళ్యాణ్ రామ్ ఒక్కడి నిర్ణయం మాత్రమే కాదు. ఇది ఒక ఫ్యామిలీ విషయం. ఏ నిర్ణయం తీసుకున్నా ఒక కుటుంబంగా కలిసే తీసుకుంటాము. ఎటు ఎలా ప్రయాణించాలన్నా కలిసి నిర్ణయం తీసుకున్న తరువాతే అటువైపుగా వెళ్తాము" అని బదులిచ్చారు.
ఇక ఈ జవాబుని విలేకరి ప్రశ్నిస్తూ.. "ఇక్కడ ఫ్యామిలీ అంటే మీరు, తారక్ (జూనియర్ ఎన్టీఆర్) అని అనుకోవాలా..?" అని ప్రశ్నించారు. దీనికి కళ్యాణ్ రామ్ బదులిస్తూ.. "ఫ్యామిలీ అంటే నేను, తారక్ మాత్రమే. ఇంకెవరు లేరు. కట్టెకాలెవరుకు ఇద్దరం అన్నదమ్ములుగా ఒక కుటుంబంగా కలిసి ఉంటాము" అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట హాట్ టాపిక్ గా మారాయి.
Next Story