Mon Dec 23 2024 08:02:26 GMT+0000 (Coordinated Universal Time)
OTT Movies : ఓటీటీలోకి వచ్చేసిన అమిగోస్
ఊహించిన స్థాయిలో రెస్పాన్స్ లేకపోవడంతో.. బాక్సాఫీస్ వద్ద డీలా పడింది. వైవిధ్యమైన కథనంతో తెరకెక్కిన సినిమానే అయినా..
బింబిసార వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత.. నందమూరి కల్యాణ్ రామ్ త్రిపాత్రిభినయం చేసిన సినిమా అమిగోస్. రిలీజ్ కు ముందు టీజర్లు, ట్రైలర్ తో ప్రేక్షకుల్లో అంచనాలు క్రియేట్ చేసిన అమిగోస్.. ఫిబ్రవరి 10న థియేటర్లలో విడుదలైంది. కానీ.. ఊహించిన స్థాయిలో రెస్పాన్స్ లేకపోవడంతో.. బాక్సాఫీస్ వద్ద డీలా పడింది. వైవిధ్యమైన కథనంతో తెరకెక్కిన సినిమానే అయినా.. ప్రేక్షకులను మెప్పించడంలో మాత్రం సక్సెస్ అవలేదు. అతి తక్కువ సమయంలోనే థియేటర్ల నుండి బయటకు వచ్చేసిన అమిగోస్.. ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చింది.
ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం నెట్ ఫ్లిక్స్ అమిగోస్ స్ట్రీమింగ్ రైట్స్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమాను ఏప్రిల్ 1 నుంచి స్ట్రీమ్ చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. చెప్పినట్టుగానే నేటి నుంచి అమిగోస్ సినిమా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కు వచ్చింది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమాను రాజేందర్ రెడ్డి డైరెక్ట్ చేయగా.. అషికా రంగనాథ్ హీరోయిన్ గా నటించింది. థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయిన వారు.. నెట్ ఫ్లిక్స్ లో ఎంజాయ్ చేయొచ్చని తెలిపింది.
Next Story