Mon Dec 23 2024 05:11:32 GMT+0000 (Coordinated Universal Time)
అమిగోస్ టీజర్.. కొత్త ఏడాదిలో కల్యాణ్ రామ్ కు మరో హిట్ ఖాయం
అతనే మైఖేల్. అంటే "అమిగోస్"లో కల్యాణ్ రామే హీరో అండ్ విలన్. ప్రపంచంలో మనిషిని పోలిన వ్యక్తులు మరొకరు..
గతేడాది.. ఎలాంటి అంచనాలు లేకుండా బింబిసార గా వచ్చి.. బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న కల్యాణ్ రామ్.. నెక్ట్స్ సినిమాను లైన్లో పెట్టేశాడు. అమిగోస్ అంటూ.. మూడు పాత్రల్లో మెస్మరైజ్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ సినిమా టీజర్ ను నేడు వదిలారు. నిమిషం నిడివితో ఉన్న టీజర్ ఆడియన్స్ లో కొత్త క్యూరియాసిటీని క్రియేట్ చేసింది. సినిమాలో యాక్షన్ తో పాటు.. వైవిధ్యాన్ని కూడా చూపించబోతున్నట్లు టీజర్ లో చెప్పేశారు.
కల్యాణ్ రామ్ త్రిపాత్రాభినయం చేస్తుండగా.. ఒకటి అమాయకమైన పాత్ర, మరొకటి మోడ్రన్ లుక్ లో ఉన్న పాత్రగా కనిపిస్తాయి. ఇంకోపాత్ర విలన్. అతనే మైఖేల్. అంటే "అమిగోస్"లో కల్యాణ్ రామే హీరో అండ్ విలన్. ప్రపంచంలో మనిషిని పోలిన వ్యక్తులు మరొకరు ఉంటారు అనే కాన్సెప్ట్ తో వస్తుంది ఈ సినిమా. ఇక కథ విషయానికి వస్తే.. మైఖెల్ అనే వ్యక్తికి ఏదో సమస్య వస్తుంది. ఆ సమస్య నుంచి తప్పించుకోడానికి ప్రపంచంలో తనని పోలిన వ్యక్తుల కోసం వెతుకుతూ మిగిలిన ఇద్దరి దగ్గరకి చేరుకుంటాడు. తమలాగే ఉన్న మైఖేల్ వల్ల ఆ ఇద్దరూ ఎలాంటి ప్రమాదాలు ఎదుర్కొన్నారు ? అసలు మైఖేల్ ఎవరు ? అన్న దానిపై సస్పెన్స్ క్రియేట్ చేశాడు దర్శకుడు.
ఈ సినిమాతే రాజేంద్రరెడ్డి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఆషిక రంగనాథ్ హీరోయిన్ గా పరిచయం అవుతుండగా.. జిబ్రాన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. ఫిబ్రవరి 10వ తేదీన ఈ మూవీని థియేటర్లలో విడుదల చేయబోతున్నారు.
Next Story