Mon Dec 23 2024 05:48:42 GMT+0000 (Coordinated Universal Time)
సంతోష్ శోభన్ "కళ్యాణం కమనీయం" ట్రైలర్.. స్వీట్ రొమాంటిక్ ఎంటర్టైనర్
కొన్నాళ్లు బాగానే ఉన్నా.. ఆ తర్వాత తన భర్త ఉద్యోగం చేయాలని కోరుకుంటుంది భార్య. ఆ విషయంలో వెనక్కి తగ్గదు.
టాలీవుడ్లో వరుసగా రొమాంటిక్, ఫ్యామిలీ సబ్జెక్ట్ ఉన్న సినిమాలు చేస్తూ.. అతి తక్కువ కాలంలో ప్రేక్షకుల్లో మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకున్న హీరోల్లో సంతోష్ శోభన్ కూడా ఒకరు. సంతోష్ హీరోగా.. తాజాగా తెరకెక్కిన సినిమా కళ్యాణం కమనీయం. షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా.. ఈ సంక్రాంతికే పెద్దసినిమాలకు పోటీగా బరిలోకి దిగనుంది. ప్రియా భవానీ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు అనిల్ కుమార్ దర్శకత్వం వహించాడు. తాజాగా సినిమా థియేట్రికల్ ట్రైలర్ ను స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి చేతులమీదుగా రిలీజ్ అయింది.
ట్రైలర్ మొత్తం పెళ్లి, రొమాన్స్ ను చూపించారు. సినిమా కథ ఏంటో ట్రైలర్ లోనే చూపించేశారు. ఉద్యోగం లేని ఓ యువకుడికి పెళ్లి, భార్య ఉద్యోగం చేసివస్తే.. ఇంట్లో ఖాళీగా కూర్చుంటాడు. అల్లుడికి సపోర్ట్ చేసే మామ. కొన్నాళ్లు బాగానే ఉన్నా.. ఆ తర్వాత తన భర్త ఉద్యోగం చేయాలని కోరుకుంటుంది భార్య. ఆ విషయంలో వెనక్కి తగ్గదు. దాంతో భార్య కోసం హీరో ఎలాంటి పాట్లు పడ్డాడు. తన భార్య కోరినట్లుగా ఉద్యోగం చేశాడా.. లేక వేరే ఏదైనా పని చేస్తాడా.. ఈ క్రమంలో వారిమధ్య ఏర్పడే మనస్పర్థలు ఎలాంటి పరిణామాలకు దారి తీశాయి. చివరకు వారిద్దరు మళ్లీ ఎలా కలుసుకుంటారు అనేది ఈ సినిమా కథగా ఉండబోతుందని ఈ ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. యువీ కాన్సెప్ట్స్ బ్యానర్ పై నిర్మించిన "కళ్యాణం కమనీయం" జనవరి 14న విడుదల కానుంది.
Next Story