Mon Dec 23 2024 06:04:57 GMT+0000 (Coordinated Universal Time)
అమిగోస్ ట్రైలర్.. ముగ్గురిగా కల్యాణ్ రామ్ నటవిశ్వరూపం
ఆ గ్యాంగ్ స్టర్ కి వచ్చే ప్లాబ్రమ్స్ లో వీళ్లని ఇరికిస్తాడా ? అన్నదే సినిమా. అయితే.. ఆ గ్యాంగ్ స్టర్ NIA కళ్లు కప్పేందుకు
కల్యాణ్ రామ్.. ఇప్పుడిప్పుడే విభిన్నమైన కథలతో వరుస విజయాలను అందుకునేందుకు రెడీ అవుతున్నాడు. గతేడాది బింబిసారతో వచ్చిన కల్యాణ్ రామ్.. ఈ ఏడాది అమిగోస్ అంటూ రాబోతున్నాడు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకూ వచ్చిన ఫస్ట్ లుక్, గ్లింప్స్, ఎన్నో రాత్రులొస్తాయి గానీ వీడియో సాంగ్ హైప్ ఇచ్చాయి. ఇక తాజాగా.. సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు మేకర్స్. కల్యాణ్ రామ్ తొలిసారి త్రిపాత్రాభినయంలో కనిపించనున్నాడు. ట్రైలర్ ను ఇంట్రస్టింగ్ గా కట్ చేశారు.
మైఖేల్ అనే గ్యాంగ్ స్టర్.. తనలాగే ఉండే మరో ఇద్దరు మంజునాథ్, సిద్ధార్థ్ వెతికి పట్టుకుంటాడు. ఆ తర్వాత వాళ్లను ఎలా ఉపయోగించుకుంటాడు. ఆ గ్యాంగ్ స్టర్ కి వచ్చే ప్లాబ్రమ్స్ లో వీళ్లని ఇరికిస్తాడా ? అన్నదే సినిమా. అయితే.. ఆ గ్యాంగ్ స్టర్ NIA కళ్లు కప్పేందుకు తనలా ఉన్న ఇద్దరిని వాడుకున్నాడన్నది ట్రైలర్ లో చూపించారు. మూడు పాత్రల్లోనూ.. మూడు రకాల మ్యానరిజం. జూనియర్ ఎన్టీఆర్ లవకుశ మాదిరిగా అనమాట. వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ తర్వాత.. మైత్రీ మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న సినిమా ఇది. ఈ సినిమాకు రాజేంద్ర రెడ్డి..రచన, దర్శకత్వం వహిస్తున్నారు. అషిక రంగనాథ్ హీరోయిన్ గా పరిచయమవుతోంది. ఫిబ్రవరి 10న ఈ సినిమా థియేటర్లలో విడుదల కాబోతోంది.
Next Story