బాబాయ్ ని ఆదుకున్న అబ్బాయ్..!
ఎన్టీఆర్ బయోపిక్ తో బాలకృష్ణ అవమానానికి గురికావడంతో పాటు బోలెడంత లాస్ అయ్యాడు. ఎందుకంటే హీరో ఆయనే, నిర్మాత ఆయనే. మరి ఆ సినిమాతో బాలకృష్ణ చేతులు [more]
ఎన్టీఆర్ బయోపిక్ తో బాలకృష్ణ అవమానానికి గురికావడంతో పాటు బోలెడంత లాస్ అయ్యాడు. ఎందుకంటే హీరో ఆయనే, నిర్మాత ఆయనే. మరి ఆ సినిమాతో బాలకృష్ణ చేతులు [more]
ఎన్టీఆర్ బయోపిక్ తో బాలకృష్ణ అవమానానికి గురికావడంతో పాటు బోలెడంత లాస్ అయ్యాడు. ఎందుకంటే హీరో ఆయనే, నిర్మాత ఆయనే. మరి ఆ సినిమాతో బాలకృష్ణ చేతులు కాల్చుకోవడం.. తండ్రి పరువుని తీసెయ్యడం జరిగిపోయాయి. ఇక ఈ సినిమాలో బాలకృష్ణ గెస్ట్ ఆర్టిస్టులుగా చాలామందిని తీసుకున్నాడు. అలాగే తమ ఫ్యామిలీ మెంబెర్స్ లోని చాలామందిని ఎన్టీఆర్ బయోపిక్ లో భాగం చేసాడు. ఇక అతిథి పాత్రలుగా నటించిన వాళ్లు ఎన్టీఆర్ మీదున్న గౌరవంతో సినిమాలో నటించారు. అందులో ముఖ్యంగా హరికృష్ణ పాత్రకి కళ్యాణ్ రామ్ ని తీసుకున్నాడు. ఇక జూనియర్ ఎన్టీఆర్ కి ఎన్టీఆర్ బయోపిక్ లో స్థానమైతే ఇవ్వలేదు కానీ ఆ సినిమా ప్రమోషనల్ ఈవెంట్ కి మాత్రం పిలిచాడు బాలకృష్ణ.
పారితోషకం లేకుండానే…
ఇక తండ్రి హరికృష్ణ పాత్రలో కళ్యాణ్ రామ్ మరీ అదరగొట్టకపోయినా.. పర్వాలేదనిపించారు. కథానాయకుడులో తల్లి బసవతారకం ఎన్టీఆర్ గురించి కొడుకు హరికృష్ణకు చెప్పడంతో ఆ సినిమా మొదలవుతుంది. ఇక కథానాయకుడులో అక్కడక్కడా కనిపించిన కళ్యాణ్ రామ్ మహానాయకుడిలో పలు సీన్స్ లో కనిపించాడు. చైతన్య రధసారథిగా తండ్రి పాలిటిక్స్ లోకి వచ్చినప్పుడు వెన్నుదన్నుగా నిలిచాడు. ఇక కళ్యాణ్ రామ్ హరికృష్ణ పాత్రలో అక్కడక్కడ కోపాన్ని ప్రదర్శిస్తూ తండ్రిని మెప్పించాడు. మరి మంచి క్యారెక్టర్ అందుకున్న కళ్యాణ్ రామ్ బాబాయ్ బాలయ్య నుండి ఆ సినిమా కోసం నయా పైసా తీసుకోలేదట. మరి అసలే లాస్ లో ఉన్న బాలయ్యని కళ్యాణ్ రామ్ కొంత ఆదుకున్నట్టేగా.