Mon Dec 23 2024 01:29:54 GMT+0000 (Coordinated Universal Time)
కల్యాణ్ రామ్ అమిగోస్"ఎన్నో రాత్రులొస్తాయి" సాంగ్ రిలీజ్ వాయిదా
తన సోదరుడు అనారోగ్యంతో బాధపడుతున్న సమయంలో తన సినిమా ప్రమోషన్ చేయడం సరైంది కాదనుకున్నాడు..
సినీ నటుడు, టీడీపీ నేత నందమూరి తారకరత్న నిన్న నారా లోకేష్ మొదలుపెట్టిన ‘యువగళం’ పాదయాత్ర కార్యక్రమంలో పాల్గొనేందుకు కుప్పం చేరుకున్నాడు. అక్కడ పూజల అనంతరం.. నారా లోకేష్, నందమూరి బాలకృష్ణలతో కలిసి తారకరత్న కూడా పాదయాత్రలో పాల్గొన్నాడు. కొద్దిదూరం వెళ్లగానే తారకరత్న అస్వస్థతతో స్పృహతప్పి పడిపోయాడు. అక్కడి నుండి కుప్పం ఆస్పత్రికి, ఆ తర్వాత బెంగళూరుకు నారాయణ హృదయాలయకు తారకరత్నను తరలించారు.
ఇప్పటికీ తారకరత్న ఆరోగ్యం విషమంగానే ఉందని వైద్యులు తెలిపారు. తన సోదరుడు అనారోగ్యంతో బాధపడుతున్న సమయంలో తన సినిమా ప్రమోషన్ చేయడం సరైంది కాదనుకున్నాడు కల్యాణ్ రామ్. తాజాగా కల్యాణ్ రామ్ నటిస్తోన్న సినిమా అమిగోస్. ఈ సినిమా టీజర్ ఇటీవలే విడుదలవ్వగా.. మంచి ఇంట్రస్ట్ ను క్రియేట్ చేశారు. కల్యాణ్ రామ్ త్రిపాత్రాభినయంలో కనిపించబోతోన్న మొదటి సినిమా ఇది. ఫిబ్రవరి నెలలో విడుదలకు సిద్దమవుతుండడంతో మూవీ ప్రమోషన్స్ మొదలు పెట్టారు మేకర్స్. ఈ క్రమంలోనే ఇటీవల ఒక పాటని రిలీజ్ చేసిన చిత్ర యూనిట్.. రెండో పాటకి ముహూర్తం ఫిక్స్ చేశారు.
బాలకృష్ణ సూపర్ హిట్ సాంగ్స్ లో ఒకటైన ‘ఎన్నో రాత్రులొస్తాయి గాని రాదే వెన్నలమ్మ’ పాటని ఈ సినిమాలో రీమేక్ చేశాడు కళ్యాణ్ రామ్. ఈ సాంగ్ ప్రోమోని నిన్న రిలీజ్ చేస్తూ.. ఫుల్ సాంగ్ ని ఈ ఆదివారం సాయంత్రం గం.5:09 నిమిషాలకు విడుదల చేయబోతున్నట్లు ప్రకటించాడు. కానీ ఇప్పుడు ఆ పాట రిలీజ్ ని పోస్ట్ పోన్ చేస్తున్నట్లు ప్రకటించారు నిర్మాతలు. "తారకరత్న ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా సాంగ్ రిలీజ్ ని వాయిదా వేస్తున్నాం. సోమవారం నాడు ఈ పాటని విడుదల చేస్తాం. తారకరత్న గారు త్వరగా కోలుకోవాలంటూ అమిగోస్ చిత్ర యూనిట్ నుంచి ప్రార్ధిస్తున్నాం" అంటూ అంటూ ట్వీట్ చేశారు.
Next Story