Mon Dec 23 2024 12:17:01 GMT+0000 (Coordinated Universal Time)
ఆ సినిమా కోసమే గడ్డం పెంచుతున్నా.. కమల్ హాసన్ కామెంట్స్..
తాజాగా ఒక అవార్డు ఫంక్షన్ వేడుకలో కమల్ హాసన్ మాట్లాడుతూ.. ఒక సినిమా కోసం గడ్డం పెంచుతున్నట్లు చెప్పుకొచ్చాడు. కమల్ కామెంట్స్ ప్రభాస్ కల్కి గురించేనా..?
లోకనాయకుడు కమల్ హాసన్ (Kamal Haasan) 'విక్రమ్' సినిమా సక్సెస్ తో సినిమాల విషయంలో ఫుల్ స్పీడ్ మెయిన్టైన్ చేస్తున్నాడు. నటుడు గానే కాకుండా నిర్మాతగా కూడా వరుస సినిమాలు అనౌన్స్ చేస్తూ దూసుకుపోతున్నాడు. ప్రొడ్యూసర్గా శింబు, శివ కార్తికేయన్ తో సినిమాలు మొదలు పెట్టిన కమల్.. హీరోగా శంకర్తో 'ఇండియన్ 2', హెచ్ వినోథ్తో 'KH233', మణిరత్నంతో 'KH234' సినిమాలు చేస్తున్నాడు. అలాగే ప్రభాస్ 'కల్కి 2898 AD' సినిమాలో విలన్ గా చేస్తున్నాడు.
అక్టోబర్ నెలలో కల్కి మూవీ సెట్స్ లోకి కమల్ అడుగుపెట్టనున్నాడని సమాచారం. ఇది ఇలా ఉంటే, తాజాగా ఒక అవార్డు ఫంక్షన్ వేడుకలో కమల్ హాసన్ మాట్లాడుతూ.. ఒక సినిమా కోసం గడ్డం పెంచుతున్నట్లు చెప్పుకొచ్చాడు. ఇంతకీ కమల్ కామెంట్స్ ఏ మూవీ గురించి..? ఈ విషయాన్ని కూడా కమలే చెప్పేశాడు. మణిరత్నంతో తీయబోయే సినిమా కోసమే గడ్డం పెంచబోతున్నట్లు కమల్ వెల్లడించాడు. గతంలో వీరిద్దరి కలయికలో 'నాయకుడు' సినిమా ఆడియన్స్ ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ అందుకుంది.
ఇప్పుడు తెరకెక్కించే చిత్రాన్ని కూడా అదే తరహాలో ఉండబోతుందని కూడా కమల్ తెలియజేశాడు. అయితే ఈ సినిమా ఎప్పుడు మొదలవ్వబోతుంది అనేదాని పై కమల్ క్లారిటీ ఇవ్వలేదు. కమల్ ఆల్రెడీ KH233 ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ లో పాల్గొంటున్నాడు. ఈ సినిమా పూర్తి యాక్షన్ ఓరియంటెడ్ గా తెరకెక్కబోతుంది. దీంతో కొన్ని రోజులు నుంచి మెషిన్ గన్స్ తో షూటింగ్ ప్రాక్టీస్ చేస్తూ వస్తున్నాడు కమల్.
ఇక షూటింగ్ పూర్తి చేసుకున్న ఇండియన్ 2 పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటుంది. కల్కి విషయానికి వస్తే.. ఈ మూవీలో కమల్ హాసన్ లుక్ ని ఆల్రెడీ ఫైనల్ చేశారు. గతంలో కామిక్ కాన్ ఈవెంట్ కి వెళ్ళినప్పుడు కమల్ లుక్ టెస్ట్ ని పూర్తి చేసినట్లు నిర్మాత అశ్వినీ దత్ తెలియజేశాడు. ఈ చిత్రాలు అన్నిటితో అభిమానులకు ఫుల్ కిక్ ఇవ్వనున్నాడు లోకనాయకుడు.
Next Story