Fri Mar 21 2025 01:14:40 GMT+0000 (Coordinated Universal Time)
భారీ రేటుకు కమల్ 'విక్రమ్' తెలుగు డబ్బింగ్ రైట్స్
పరభాషా నటుడే అయినా.. తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆయనను అలా చూడలేదు. 'విక్రమ్' ను తమిళంతో పాటు తెలుగులోనూ..

చెన్నై : కమలహాసన్ హీరోగా తాజాగా రూపొందిన చిత్రం విక్రమ్. సొంత బ్యానర్ పై కమల్ హాసన్ నిర్మించిన ఈ సినిమాకు లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించాడు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ లో బిజీగా ఉంది. ఈ నెల 14వ తేదీన 'విక్రమ్' విడుదల తేదీని ప్రకటించనున్నారు. కాగా.. కమల్ హాసన్ కు తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. ఆయన సినిమాలు తెలుగునాట కూడా ప్రేక్షకాదరణ పొందుతుంటాయి.
పరభాషా నటుడే అయినా.. తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆయనను అలా చూడలేదు. 'విక్రమ్' ను తమిళంతో పాటు తెలుగులోనూ భారీ స్థాయిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో 'విక్రమ్' తెలుగు డబ్బింగ్ రైట్స్ ఏకంగా రూ.11 కోట్లకు అమ్ముడుపోయినట్లు టాక్. కమల్ సినిమా తెలుగు డబ్బింగ్ రైట్స్ ఈ రేంజ్ లో అమ్ముడుపోవడానికి తెలుగులో ఆయనకు ఉన్న ఫాలోయింగ్ ఒక కారణమయితే.. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా కావడం మరో కారణమంటున్నారు సినీ ప్రముఖులు. ఈ సినిమాలో విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్ వంటి సీనియర్ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
Next Story