Mon Dec 23 2024 11:47:22 GMT+0000 (Coordinated Universal Time)
Kalki 2898 AD: ప్రభాస్ ఫ్యాన్స్‌కి షాక్ ఇచ్చిన కమల్.. కల్కి సినిమాలో..
ప్రభాస్ ఫ్యాన్స్‌తో పాటు అందర్నీ షాక్‌కి గురి చేసిన కమల్ హాసన్. కల్కి సినిమాలో..
Kalki 2898 AD : హిందూ పురాణ కథల నేపథ్యంతో హాలీవుడ్ స్థాయిలో తెరకెక్కుతున్న ఇండియన్ ఫ్యూచరిస్టిక్ మూవీ 'కల్కి 2898 AD'. నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ హీరోగా నటిస్తుంటే దీపికా పదుకోన్, దిశా పటాని హీరోయిన్స్‌గా, అమితాబ్ బచ్చన్ ఓ ముఖ్య పాత్ర చేస్తున్నారు. ఇక ఈ మూవీలో కమల్ హాసన్ కూడా ఓ కీలక పాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. ఆ రోల్ విలన్ పాత్రే అని ఇన్నాళ్లు అందరూ అనుకున్నారు.
అయితే ఇప్పుడు సడన్‌గా అది కేవలం గెస్ట్ రోల్ మాత్రమే అంటున్నారు కమల్ హాసన్. రీసెంట్ ఇంటర్వ్యూలో కమల్ మాట్లాడుతూ.. "ప్రభాస్ నటిస్తున్న కల్కి సినిమాలో నేను ఓ గెస్ట్ రోల్ చేస్తున్నాను. దాని షూటింగ్ కూడా పూర్తీ అయ్యింది" అంటూ చెప్పుకొచ్చారు. ఇక ఈ కామెంట్స్ ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు అందర్నీ షాక్ కు గురి చేసింది. కమల్ హాసన్ విలన్, ప్రభాస్ హీరో అంటే సినిమా ఓ రేంజ్ లో ఉంటుందని భావించారు.
కానీ ఇప్పుడు సడన్ గా అది కేవలం గెస్ట్ రోల్ మాత్రమే అని చెప్పడంతో.. వారి ఆశలు అన్ని నిరాశలు అయ్యిపోయాయి. కాగా కల్కి మూవీ ఒక బాగంలా కాకుండా రెండు మూడు భాగాలుగా రూపొందుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈక్రమంలోనే మొదటి భాగం చివరిలో కమల్ గెస్ట్ రోల్ లా కనిపించి.. నెక్స్ట్ పార్ట్స్ లో పూర్తి స్థాయి విలన్ గా కనిపించనున్నారని కొందరు అంచనాలు వేయడం స్టార్ట్ చేస్తున్నారు. మరి సినిమాలో కమల్ ఏ రోల్ లో కనిపిస్తారో చూడాలి.
Next Story