అపోలో ఫ్యామిలీతో దుబాయ్ వెళ్లిన ఉపాసన
ఉపాసన కామినేనికి ప్లానింగ్ అంటే ఇష్టం. అటు కుటుంబానికి, ఇటు వృత్తికీ, అటు వ్యాపకానికీ అన్నింటికీ సమంగా సమయాన్ని పంచగల దిట్ట ఆమె. ఆమెకు సోషల్ మీడియా [more]
ఉపాసన కామినేనికి ప్లానింగ్ అంటే ఇష్టం. అటు కుటుంబానికి, ఇటు వృత్తికీ, అటు వ్యాపకానికీ అన్నింటికీ సమంగా సమయాన్ని పంచగల దిట్ట ఆమె. ఆమెకు సోషల్ మీడియా [more]
ఉపాసన కామినేనికి ప్లానింగ్ అంటే ఇష్టం. అటు కుటుంబానికి, ఇటు వృత్తికీ, అటు వ్యాపకానికీ అన్నింటికీ సమంగా సమయాన్ని పంచగల దిట్ట ఆమె. ఆమెకు సోషల్ మీడియా ఇంపార్టెన్సూ తెలుసూ. తన దగ్గర పనిచేసేవారి మనసులను అర్థం చేసుకోవడమూ తెలుసు. అందుకే బిజినెస్ ఉమెన్‌గా ఆమె తనదైన శైలిలో ముందుకు దూసుకుపోతున్నారు.
ఇటీవల ఉపాసన కామినేని తన 65 మంది కుటుంబసభ్యులతో దుబాయ్‌కు వెళ్లారు. 2019-20కి సంబంధించిన యాక్షన్ ప్లాన్‌ను సిద్ధం చేయడానికి వారందరితో ఆమె దుబాయ్ వెళ్లారు. ఈ కుటుంబం కంటే అపోలో లైఫ్ ఉద్యోగులు.
కొత్త ఆలోచనతో దుబాయ్ ట్రిప్
అపోలో లైఫ్‌కు సంబంధించిన 2019 కార్యాచరణలు, ప్రణాళికలను చర్చించడానికే ఉపాసన కామినేని తన అపోలో లైఫ్ కుటుంబ సభ్యులను 65 మందిని దుబాయ్ తీసుకెళ్లారు. ఎప్పుడూ కార్యాలయంలో కూర్చుని ఉండేవారు పనిచేసే ప్రదేశంలో మార్పు వస్తే మెదడు మరింత చురుగ్గా, నవ్యమైన ఆలోచనలతో వికసిస్తుందని ఉపాసన నమ్ముతారట. అందుకే సెమినార్లను కూడా వినూత్నంగా బస్సుల్లోనూ, ఎడారుల్లోనూ నిర్వహించారు. సరికొత్త ప్రదేశాల్లో పర్యటిస్తూ, ఒకరితో ఒకరు ఆత్మీయంగా మెలుగుతూ, మరిన్ని కొత్త విషయాలను చర్చించుకుంటూ సాగే ఇలాంటి పర్యటనలు వృత్తిపరంగానూ మెరుగైన పనితీరును కనబరచడానికి ఉపయోగపడుతాయనడంలో అనుమానం లేదు.