నెగటివ్ టాక్ వచ్చినా కలెక్షన్స్ ఇరగతీస్తుంది
ఈ శుక్రవారం రిలీజ్ అయినా రాఘవ లారెన్స్ చిత్రం ‘కాంఛన-3 ‘ టాక్ తో సంబంధం లేకుండా బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోతుంది. మొదటి ఆట నుండే [more]
ఈ శుక్రవారం రిలీజ్ అయినా రాఘవ లారెన్స్ చిత్రం ‘కాంఛన-3 ‘ టాక్ తో సంబంధం లేకుండా బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోతుంది. మొదటి ఆట నుండే [more]
ఈ శుక్రవారం రిలీజ్ అయినా రాఘవ లారెన్స్ చిత్రం ‘కాంఛన-3 ‘ టాక్ తో సంబంధం లేకుండా బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోతుంది. మొదటి ఆట నుండే ఈసినిమాకు నెగటివ్ టాక్ వచ్చినప్పటికీ వసూళ్ల మోత మోగిపోతుంది. హార్రర్ కామెడీ తో తెరకెక్కిన ఈచిత్రం రెగ్యులర్ చిత్రంలాగే ఉందని కామెంట్స్ చేస్తున్నారు.
‘కాంఛన’ సిరీస్‌లో ఇంతకుముందు వచ్చిన సినిమాలు ఉన్నంత ఎఫెక్టివ్‌గా ఇది లేదు. ఓన్లీ మాస్ ప్రేక్షకులని టార్గెట్ చేస్తూ చేసిన ఈచిత్రం కు తొలి రోజే తెలుగు, తమిళ భాషల్లో కలిపి రూ.20 కోట్ల దాకా గ్రాస్ కలెక్షన్లు రాబట్టడం విశేషం. ఒక్క తమిళ భాషలోనే రూ.10.6 కోట్ల గ్రాస్ సాధించిన ఈ సినిమా తెలుగులో రూ.6 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. ఇక మిగిలిన ఏరియాస్ లో 3 కోట్లు పైనే వసూల్ చేసి మొత్తంగా రూ.20 కోట్ల గ్రాస్‌తో సంచలనం సృష్టించిందీ సినిమా.
ఈమధ్య మాస్ ప్రేక్షకులని అలరించే సినిమా వచ్చి చాలా రోజులు అవ్వడం తో ఈసినిమాకి నెగటివ్ టాక్ వచ్చిన మాస్ ప్రేక్షకులు ఈమూవీ కోసం ఎగబడుతున్నట్లు కనిపిస్తోంది. మరి వీకెండ్ ఈమూవీ పరిస్థితి ఏంటో చూడాలి.