సామ్ పై పాజిటివ్ గా మాట్లాడిన ఆ బాలీవుడ్ అమ్మాయి ఎవరు?
బాలీవుడ్ సిస్టర్స్ కంగనా రనౌత్,రంగోలి చండేలా తరచూ వార్తల్లో ఉంటారు అనే విషయం అందరికి తెలిసిందే. వీరు ఏ విషయం అయినా కుండబద్దలు కొట్టేలా మాట్లాడుతారు. అందుకే [more]
బాలీవుడ్ సిస్టర్స్ కంగనా రనౌత్,రంగోలి చండేలా తరచూ వార్తల్లో ఉంటారు అనే విషయం అందరికి తెలిసిందే. వీరు ఏ విషయం అయినా కుండబద్దలు కొట్టేలా మాట్లాడుతారు. అందుకే [more]
బాలీవుడ్ సిస్టర్స్ కంగనా రనౌత్,రంగోలి చండేలా తరచూ వార్తల్లో ఉంటారు అనే విషయం అందరికి తెలిసిందే. వీరు ఏ విషయం అయినా కుండబద్దలు కొట్టేలా మాట్లాడుతారు. అందుకే వీరంటే పడని వారు చాలా మంది ఉంటారు. గతంలో వీరు ప్రముఖ హీరోస్ ని, హీరోయిన్స్, దర్శకులు,నిర్మాతల పై తీవ్ర ఆరోపణలు చేసిన సందర్భాలు ఉన్నాయి. వారితో గొడవలు కూడా జరిగాయి. రీసెంట్ గా కంగనా నటించిన “జడ్జిమెంటల్ హై క్యా” మూవీ ట్రైలర్ విషయంలో కూడా కంగనా చెల్లెలు రంగోలి, తాప్సి పైనకూడా తనదైన శైలిలో విరుచుకుపడింది.
అయితే అక్కినేని సమంత పై చాలా పాజిటివ్ గా రెస్పాండ్ అయింది రంగోలి. ఆమె నటించిన లేటెస్ట్ చిత్రం ‘ఓ బేబీ’ మూవీ పై ,సమంత పై మాత్రం ఈమె ప్రశంసలు కురిపించింది. ఓ బేబీ చిత్రం అద్భుతమైన విజయం అందుకుంది.సామ్ అసలుసిసలైన ఫెమినిస్ట్. ఆమె జీవితం ఓ సక్సెస్ స్టోరీ. ఆమె ఓ గొప్ప ఫ్యామిలి కి చెందినప్పటికీ తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకుంది. ఇలాంటి దేవతల్ని మేం మెచ్చుకుంటాం. కంగన బృందం నుంచి మీకు ఆల్ ది బెస్ట్’ అని రంగోలీ ట్వీట్ చేశారు. దానికి సామ్ ‘ఎంతో దయతో మాట్లాడిన మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు’ అని రీట్వీట్ చేసింది.