Mon Dec 23 2024 14:27:58 GMT+0000 (Coordinated Universal Time)
ఆ హీరో 2 కోట్ల పనికి 200 కోట్లు తీసుకుంటున్నాడు: కంగనా రనౌత్
కంగనా రనౌత్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ ను టార్గెట్ చేసింది. ఆమిర్ ఖాన్ 'సూపర్ స్టార్' స్టేటస్ పై విమర్శలు గుప్పించింది. లాల్ సింగ్ చద్దా పరాజయానికి కారణం బాయ్ కాట్ సంస్కృతి కాదని, సినీ ప్రేక్షకుల అవగాహనకు ప్రతిబింబమని ఆమె అన్నారు. 2015 నుండి దేశంలో అసహనాన్ని పెంచడం గురించి ఆమిర్ ఖాన్ చేసిన వ్యాఖ్యలపై కూడా కంగనా విమర్శలు గుప్పించింది. ప్రేక్షకులు ఇప్పుడు కొంతమంది నటుల సూపర్ స్టార్ స్టేటస్ ను ప్రశ్నిస్తున్నారు. కొందరు 'సూపర్స్టార్లు' రూ. 2 కోట్ల పనికి రూ. 200 కోట్లు తీసుకుంటూ ఉన్నారు.. టర్కీకి చెందిన ప్రథమ మహిళ ఎమిన్ ఎడ్డోగాన్ను కలవడానికి కూడా ఆయన్ను పిలిచారని కంగనా విమర్శించారు.
లాల్ సింగ్ చద్దా సినిమా హాలీవుడ్ లో వచ్చిన ఫారెస్ట్ గంప్ రీమేక్.. ఈ సినిమా ప్రేక్షకుల వల్ల విఫలం కాలేదని కంగనా విమర్శించింది. ప్రజల్లో వచ్చిన మార్పుల కారణంగానే ఈ ఫలితాలు వస్తున్నాయని ఆమె అన్నారు. ప్రజలు కొందరు స్టార్స్ ను మీరు నిజంగా మంచి సినిమాలను చేస్తున్నారా..? కష్టపడి సంపాదించిన డబ్బులో కొంత భాగం ఇవ్వాలనుకునే వ్యక్తి నువ్వేనా.. అని ప్రశ్నలు వేసుకుంటూ ఉన్నారు. దేశాన్ని ప్రేమించే వ్యక్తులు అతన్ని మేము చూడాలా అని ప్రశ్నించడం మొదలుపెట్టారని కంగనా తెలిపింది. సినిమాలకు సంబంధించి ప్రజల్లో అవగాహన వచ్చిందని కంగనా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం దేశంలో 'భారతీయత'తో నిండిన చిత్రాలనే ఆదరిస్తున్నారు తప్ప.. పాశ్చాత్య పోకడలతో నిండి ఉన్న సినిమాలను కాదని కంగనా విమర్శించింది. ఆమిర్ ఖాన్ సినిమా దాదాపు రూ. 180 కోట్లతో రూపొంది... బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ. 60 కోట్లు వసూలు చేసింది. కంగనా కూడా మేలో 'ధకడ్'తో భారీ ఫ్లాప్ ను అందుకుంది. తన సినిమా కూడా వెస్ట్రన్ స్టైల్ లో ఉందని.. అందుకే ఆ సినిమా కూడా ఆడలేదని కంగనా ఒప్పుకుంది.
Next Story