Mon Dec 23 2024 06:59:29 GMT+0000 (Coordinated Universal Time)
'పోకిరి'లో హీరోయిన్గా కంగనా చేయాల్సిందట.. కానీ..!
పోకిరి సినిమాలో మహేష్ బాబుకి హీరోయిన్ గా బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ చేయాల్సిందట. అయితే..
2006లో మహేష్ బాబు (Mahesh Babu) హీరోగా పూరీజగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఇండస్ట్రీ హిట్ మూవీ 'పోకిరి'. ఈ సినిమాలో హీరోయిన్ గా ఇలియానా నటించి అందర్నీ ఆకట్టుకుంది. మహేష్, ఇలియానా మధ్య కెమిస్ట్రీ ఆడియన్స్ ని బాగా అలరించింది. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా ఒక కొత్త అమ్మాయిని తీసుకోవాలని పూరి చాలామందినే సంప్రదించాడు. ఈక్రమంలోనే అప్పుడప్పుడే హీరోయిన్ గా మంచి గుర్తింపు సంపాదించుకుంటున్న 'పార్వతీ మెల్టన్'ని కూడా సంప్రదించాడు. అయితే ఆమె ఏవో కారణాలు వల్ల ఒకే చెప్పలేకపోయింది.
అయితే ఈమె తరువాత పూరి మరో హీరోయిన్ ని కూడా సంప్రదించినట్లు తెలుస్తుంది. బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ (Kangana Ranaut) ఈ మూవీలో హీరోయిన్ గా చేయాల్సిందట. ఈ విషయాన్ని కంగనా స్వయంగా రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో తెలియజేసింది. కంగనా నటించిన చంద్రముఖి 2 (Chandramukhi 2) రిలీజ్ కి సిద్ధంగా ఉంది. ఇక ఈ మూవీ ప్రమోషన్స్ లో ఉన్న కంగనా వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ వస్తుంది. ఇక తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన డెబ్యూట్ టాలీవుడ్ చిత్రంతోనే జరగాల్సి ఉందని చెప్పుకొచ్చింది.
కంగనా 2006లో బాలీవుడ్ 'గ్యాంగ్ స్టార్' అనే మూవీతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. అయితే ఈ మూవీ ఆఫర్, పోకిరి ఆఫర్ ఒకేసారి వచ్చాయట. షూటింగ్ డేట్స్ కూడా ఒకే సమయంలో ఉన్నాయి. ఇక ఈ రెండిటిలో ఏదోకటి సెలెక్ట్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు కంగనా.. 'గ్యాంగ్ స్టార్' మూవీని సెలెక్ట్ చేసుకుంది. ఇక్కడ విశేషం ఏంటంటే.. గ్యాంగ్ స్టార్, పోకిరి సినిమాలు ఒకే రోజు రిలీజ్ అయ్యాయి. రెండు సూపర్ హిట్ అయ్యినప్పటికీ.. పోకిరి పెద్ద హిట్టుగా నిలిచింది. ఇక ఈ మూవీ మిస్ చేసుకున్నందుకు ఇప్పటికి ఫీల్ అవుతున్నట్లు కంగనా చెప్పుకొచ్చింది.
తనలో టాలెంట్ ని ముందుగా గుర్తించింది పూరినే అని వెల్లడించింది. అయితే ఈ మూవీ మిస్ అయ్యినప్పటికీ, పూరీజగన్నాధ్.. తను ప్రభాస్ తో తెరకెక్కించిన 'ఏక్ నిరంజన్' సినిమాలో కంగనాకి ఛాన్స్ ఇచ్చి టాలీవుడ్ కి తీసుకు వచ్చాడు. 2009లో రిలీజ్ అయిన ఈ మూవీ పెద్దగా ఆకట్టుకోలేక పోయింది. ఆ తరువాత మళ్ళీ ఇంకో తెలుగు సినిమాలో కంగనా కనిపించలేదు.
Next Story