Mon Dec 23 2024 14:51:12 GMT+0000 (Coordinated Universal Time)
Kangana Ranaut: కంగనాకు గుడ్ న్యూస్.. అయితే ఆ సీన్స్ కట్!!
కంగనా రనౌత్ నటించిన ఎమర్జెన్సీ విడుదల
కంగనా రనౌత్ నటించిన 'ఎమర్జెన్సీ' విడుదల వాయిదా పడుతూనే వస్తోంది. ఈ సినిమాకు కంగనా నిర్మాతగా వ్యవహరించింది. ఈ సినిమా కోసం తన ఆస్తిని తాకట్టు పెట్టాల్సి వచ్చిందంటూ కంగనా అప్పట్లోనే చెప్పింది. ఇక ఈ చిత్రానికి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) నుండి UA సర్టిఫికేట్ లభించింది. కొన్ని సన్నివేశాలను కత్తిరించి, డిస్క్లైమర్లను జోడించాల్సిందిగా మేకర్స్ని CBFC బోర్డు కోరింది. సినిమాలోని చారిత్రక సంఘటనలపై డిస్క్లెయిమర్లు ఇవ్వాలని చిత్ర నిర్మాతలకు CBFC సూచించింది.
నివేదికల ప్రకారం, సెన్సార్ బోర్డుకి జూలై 8న సమీక్ష కోసం ఎమర్జెన్సీ సినిమాని పంపారు. అయితే అకల్ తఖ్త్, శిరోమణి గురుద్వారా పర్బంధక్ కమిటీతో సహా వివిధ సిక్కు సంస్థలు సిక్కు సమాజానికి వ్యతిరేకంగా చిత్రీకరించినందుకు ఈ చిత్రాన్ని నిషేధించాలని డిమాండ్ చేశారు. దీంతో ఈ చిత్రం సమస్యల్లో పడింది. పలు సిక్కు సంస్థలు సెన్సార్ బోర్డుకు లేఖలు రాసి కోర్టును కూడా ఆశ్రయించాయి. అనుపమ్ ఖేర్, శ్రేయాస్ తల్పాడే తదితరులు నటించిన ఎమర్జెన్సీ సినిమా సెప్టెంబర్ 6న సినిమా థియేటర్లలో విడుదల కావాల్సి ఉంది. కానీ పలు సమస్యల కారణంగా సినిమా విడుదలకు నోచుకోలేకపోయింది.
ప్రస్తుతానికి అయితే ఈ సినిమా విడుదల తేదీ ఇంకా ఖరారు కాలేదు. UA సర్టిఫికేట్ అనేది వివిధ వయసుల ప్రేక్షకులు సినిమాను చూడొచ్చు. అయితే చిన్న పిల్లలు తల్లిదండ్రుల మార్గదర్శకత్వంతో సినిమాను వీక్షించవచ్చని సూచిస్తుంది.
ప్రస్తుతానికి అయితే ఈ సినిమా విడుదల తేదీ ఇంకా ఖరారు కాలేదు. UA సర్టిఫికేట్ అనేది వివిధ వయసుల ప్రేక్షకులు సినిమాను చూడొచ్చు. అయితే చిన్న పిల్లలు తల్లిదండ్రుల మార్గదర్శకత్వంతో సినిమాను వీక్షించవచ్చని సూచిస్తుంది.
Next Story