Mon Dec 23 2024 23:57:26 GMT+0000 (Coordinated Universal Time)
చంద్రముఖి-2 విడుదల వాయిదా?
మరో సినిమా విడుదల వాయిదా పడింది. ఎన్నో అంచనాలు ఉన్న చంద్రముఖి-2
మరో సినిమా విడుదల వాయిదా పడింది. ఎన్నో అంచనాలు ఉన్న చంద్రముఖి-2 విడుదల వాయిదా పడనున్నట్లు తెలుస్తోంది. చంద్రముఖి 2 మూవీ రిలీజ్ సెప్టెంబర్ 28వ తేదీకి వాయిదా పడినట్టు తెలుస్తోంది. వీఎఫ్ఎక్స్ సహా మరిన్ని పోస్టు ప్రొడక్షన్ పనులు పెండింగ్లో ఉండటంతో సెప్టెంబర్ 15వ తేదీ నుంచి నుంచి ఈ సినిమా విడుదలను సెప్టెంబర్ 28వ తేదీకి మార్చేందుకు మూవీ యూనిట్ నిర్ణయించుకుందని తెలుస్తోంది. ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లోనూ చంద్రముఖి 2 రానుంది.
చంద్రముఖి 2 మూవీ ప్రమోషన్లకు చిత్ర యూనిట్ ఇప్పటికే సిద్ధమైంది. రాఘవ లారెన్స్, కంగనా రనౌత్ సహా కీలక నటీనటులు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. వివిధ రాష్ట్రాల్లోనూ ప్రీ-రిలీజ్ ఈవెంట్స్ నిర్వహించేందుకు ప్లాన్ చేస్తోంది లైకా. పాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ కానుంది ఈ చిత్రం. చంద్రముఖి 2 చిత్రానికి ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. లైకా ప్రొడక్షన్ పతాకంపై సుభాస్కరన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. వడివేలు, రాధికా శరత్ కుమార్, లక్ష్మీమీనన్, మహిమా నంబియార్ కీలక పాత్రల్లో నటించారు.
Next Story