Fri Dec 20 2024 22:27:02 GMT+0000 (Coordinated Universal Time)
రామ్ చరణ్కి నేను బిగ్ ఫ్యాన్.. కంగనా రనౌత్..
చంద్రముఖి 2 ప్రమోషన్స్ లో భాగంగా ఇంటర్వ్యూలు ఇస్తూ వస్తున్న కంగనా రనౌత్.. రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో రామ్ చరణ్ గురించి ఇంటరెస్టింగ్ కామెంట్స్ చేసింది.
బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ (Kangana Ranaut) ప్రెజెంట్ చంద్రముఖి 2 (Chandramukhi 2) మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ మూవీ రిలీజ్ దగ్గర పడడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ తో సందడి చేస్తుంది. ఈక్రమంలోనే కంగనా రీసెంట్ గా టాలీవుడ్ మీడియాకి ఇంటర్వ్యూలు ఇస్తూ వస్తుంది. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో కంగనా.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) గురించి ఇంటరెస్టింగ్ కామెంట్స్ చేసింది.
తెలుగు హీరోల్లో మీకు నచ్చిన హీరో ఎవరు..? ఎవరితో కలిసి నటించాలని అనుకుంటున్నారు..? అని ప్రశ్నించగా, కంగనా బదులిస్తూ.. "రామ్ చరణ్ సార్ కి నేను బిగ్ ఫ్యాన్ని. ఆయన సినిమాలు అంటే నాకు చాలా ఇష్టం. ఆయనతో కలిసి నటించాలని ఉంది" అంటూ చెప్పుకొచ్చింది. ఇక అలాగే అల్లు అర్జున్, సమంతతో కూడా కలిసి నటించాలని ఉందంటూ పేర్కొంది. అలాగే ఆల్రెడీ ప్రభాస్ తో కలిసి ‘ఏక్ నిరంజన్’ సినిమాలో నటించగా.. మరోసారి కలిసి యాక్ట్ చేయాలని ఉందని వెల్లడించింది.
మరో ఇంటర్వ్యూలో.. 'ఒక సౌత్ డైరెక్టర్, ఒక సౌత్ హీరోతో కలిసి చేయాలంటే, ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారు' అని ప్రశ్నించారు. దీనికి కంగనా బదులిస్తూ.. రాజమౌళి అండ్ రామ్ చరణ్ తో కలిసి చేయాలని ఉందంటూ వెల్లడించింది. ఇక ప్రతి ఇంటర్వ్యూలో కంగనా.. రామ్ చరణ్ పేరు చెపుతుండడంతో చరణ్ అభిమానులు అందుకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ సందడి చేస్తున్నారు.
ఇక చంద్రముఖి 2 మూవీ విషయానికి వస్తే.. రాఘవ లారెన్స్ హీరోగా తెరకెక్కిన ఈ మూవీని పి.వాసు డైరెక్ట్ చేస్తున్నాడు. చంద్రముఖి 1ని కూడా వాసునే తెరకెక్కించాడు. ఆస్కార్ విజేత ఎం ఎం కీరవాణి ఈ మూవీకి మ్యూజిక్ అందిస్తున్నాడు. సెప్టెంబర్ 28న ఈ మూవీ పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కాబోతుంది. మరి చంద్రముఖి 1లా ఈ చంద్రముఖి కూడా భయపెడుతుందా..? లేదా..? చూడాలి.
Next Story