Tue Dec 24 2024 01:33:59 GMT+0000 (Coordinated Universal Time)
దళితులపై నటుడు ఉపేంద్ర వివాదాస్పద వ్యాఖ్యలు.. ఏమి జరిగిందంటే?
తన పార్టీ అభిమానులు, మద్దతుదారులతో లైవ్ సెషన్ నిర్వహించిన
తన పార్టీ అభిమానులు, మద్దతుదారులతో సోషల్ మీడియాలో లైవ్ సెషన్ నిర్వహించిన కన్నడ నటుడు ఉపేంద్ర అనుకోని వివాదంలో ఇరుక్కున్నారు. ఉపేంద్ర తన రాజకీయ పార్టీ ప్రజాకీయను విమర్శిస్తున్న వారిపై ఫేస్బుక్ సెషన్లో విమర్శలు గుప్పిస్తూ వాడిన పదం విమర్శలకు తావిస్తోంది. ఉపేంద్ర లైవ్ లో మాట్లాడుతూ.. నిష్కల్మషమైన హృదయాలతోనే మార్పు సాధ్యం. అలాంటి వారందరూ నా వెంట రావాలని, తమ అభిప్రాయాలు వెల్లడించాలని కోరుకుంటున్నా అన్నారు. వారి సలహాలు మనకు మేలు చేస్తాయి. ఇలాంటి వాళ్లు ఇతరులను అవమానించరు. ఇష్టారీతిన మాట్లాడరు. కానీ కొందరు మాత్రం చాలా ఖాళీగా ఉంటారు.. మనసుకు తోచింది వాగేస్తుంటారు. వాళ్ల గురించి మనమేం చేయలేము. ఓ నగరం ఉందంటే అక్కడ తప్పనిసరిగా దళితులు ఉన్నట్టు వీళ్లు కూడా ఉంటుంటారని కామెంట్ చేశారు.
ఈ వ్యాఖ్యల వీడియో వైరల్ కావడంతో తీవ్ర విమర్శలు వచ్చాయి. రామనగర ప్రాంతంలో పలు నిరసన కార్యక్రమాలు నిర్వహించాయి. వెంటనే ఉపేంద్ర సోషల్ మీడియా వేదికగా క్షమాపణలు చెప్పారు. పొరపాటున ఓ అభ్యంతరకర వ్యాఖ్య చేశానని అన్నారు.. ఆ వ్యాఖ్యలు అనేక మంది మనసులను గాయపరిచాయని తెలియగానే వీడియోను డిలీట్ చేశాను. ఇలాంటి వ్యాఖ్య చేసినందుకు క్షమాపణ చెబుతున్నానని ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. అయితే అప్పటికే కర్ణాటకలోకి పలు ప్రాంతాలలో ఉపేంద్రకు వ్యతిరేకంగా కేసులు నమోదయ్యాయి.
Next Story