Mon Dec 23 2024 07:43:00 GMT+0000 (Coordinated Universal Time)
పెళ్లిపీటలెక్కనున్న మరో హీరో-హీరోయిన్.. సింపుల్ గా ఎంగేజ్ మెంట్
తెలుగులో పిల్ల జమిందార్, జైసింహా సినిమాల్లో నటించి ప్రస్తుతం కన్నడలో వరుస సినిమాలు చేస్తున్న హరిప్రియ ప్రేమించుకున్నారు.
ఇటీవల కాలంలో సినీ పరిశ్రమలో నటీనటులు, డైరెక్టర్ -హీరోయిన్లు పెళ్లిళ్లు చేసుకోవడం కామనైపోయింది. అన్ని సినీ పరిశ్రమల్లో ఇప్పుడిదే ట్రెండ్. అప్పట్లో సుహాసిని-మణిరత్నం, రమ్యకృష్ణ-కృష్ణవంశీ, ఇప్పుడు నమిత- వీరేంద్ర, నయన్-విఘ్నేశ్, రణ్ వీర్ - దీపికా పదుకొనె, రణబీర్-అలియా ఇలా చాలా జంటలు ప్రేమ, ఆ తర్వాత పెళ్లితో ఒక్కటయ్యాయి. ఇక ఇటీవల తమిళ పరిశ్రమలో హీరో గౌతమ్ కార్తీక్, హీరోయిన్ మంజిమా మోహన్ పెళ్లి చేసుకున్నారు. తాజాగా కన్నడ పరిశ్రమలో మరో హీరో-హీరోయిన్ పెళ్లి పీటలెక్కనున్నారు.
కన్నడలో పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, హీరోగా చేసి ప్రస్తుతం వరుస సినిమాలతో దూకుడు పెంచిన వశిష్ఠ సింహా, తెలుగులో పిల్ల జమిందార్, జైసింహా సినిమాల్లో నటించి ప్రస్తుతం కన్నడలో వరుస సినిమాలు చేస్తున్న హరిప్రియ ప్రేమించుకున్నారు. వీరిద్దరూ ఓ సినిమాలో కలిసినటించినప్పటి నుండి ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. గత కొద్ది రోజులుగా వీరు డేటింగ్ లో ఉన్నారంటూ కన్నడ మీడియాలో జోరుగా వార్తలొచ్చాయి. ఇద్దరూ చెట్టాపట్టాలేసుకొని తిరుగుతుంటే మీడియా కంట కూడా పడ్డారు. దీంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ కన్నడ మీడియా రాసింది.
తాజాగా వారే తమ ప్రేమ గురించి అందరికీ చెప్పేశారు. తమ సోషల్ మీడియాలో అధికారికంగా వశిష్ఠ, హరిప్రియ కలిసి ఉన్న ఫొటోని పోస్ట్ చేసి ఎంగేజ్మెంట్ చేసుకున్నాం.. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాం అని తెలిపారు. డిసెంబర్ 3న కుటుంబ సభ్యుల మధ్య వీరి నిశ్చితార్థం సింపుల్ గా జరిగింది. ఈ న్యూ లవ్ కపుల్ కి అభిమానులు, నెటిజన్లు, ప్రముఖులు సోషల్ మీడియాలో వీరికి కంగ్రాట్స్ చెప్తున్నారు.
Next Story