Fri Dec 20 2024 05:19:48 GMT+0000 (Coordinated Universal Time)
Ram Charan : RC16లో ఆ మెగాస్టార్ ముఖ్య పాత్ర.. ఎవరో తెలుసా..?
రామ్చరణ్ సినిమాలో ఆ మెగాస్టార్ ముఖ్య పాత్ర చేయబోతున్నారట. ఎవరో తెలుసా..?
Ram Charan : మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, నేషనల్ అవార్డు విన్నర్ బుచ్చిబాబు దర్శకత్వంలో RC16 సినిమా చేయబోతున్న విషయం అందరికి తెలిసిందే. అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్న ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు మొదలవుతుందో అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయి. ఈక్రమంలోనే సినిమాలో నటించబోయే నటీనటులను ఎంపిక చేసే పనిలో ఉన్నారు.
కాగా ఈ మూవీ కోసం విజయ్ సేతుపతి, సాయి పల్లవిని ఎంపిక చేసుకున్నట్లు ఇప్పటికే పలు వార్తలు బయటకి వచ్చాయి. ఇప్పుడు మరో వార్త ఫిలిం వర్గాల్లో వినిపిస్తుంది. కన్నడ మెగాస్టార్ శివరాజ్ కుమార్.. ఈ మూవీలో ఓ ముఖ్య పాత్ర చేయబోతున్నారట. ఈ విషయాన్ని స్వయంగా శివరాజ్ కుమార్ తన సన్నిహితులతో అన్నట్లు ఫిలిం సర్కిల్లో వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తలో ఎంత నిజముందో తెలియాలంటే అఫీషియల్ అనౌన్స్మెంట్ కోసం వేచి చూడాల్సిందే.
కాగా ఈ సినిమా కథ ఉత్తరాంధ్ర ప్రాంతంలో సాగనుంది. దీంతో ఆ ప్రాంతం యాసలో మాట్లాడే నటీనటులు కావాలంటూ ఇటీవల ఓ ఆడిషన్ కాల్ కూడా ఇచ్చారు. ఈ సినిమా పల్లెటూరు నేపథ్యంతో స్పోర్ట్స్ చుట్టూ జరుగుతుందని సమాచారం. ఈ ఏడాది సమ్మర్ లో ఈ సినిమాని పట్టాలు ఎక్కించబోతున్నారు. పూజా కార్యక్రమాలతో లాంచ్ చేసేటప్పుడే మూవీ యూనిట్ మొత్తాన్ని ప్రకటించనున్నారు.
వృద్ధి సినిమాస్ బ్యానర్ లో మొదటి చిత్రంగా తెరకెక్కబోతున్న ఈ సినిమాకి మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ కూడా సహనిర్మాతులుగా చేస్తున్నాయి. ఇక ఈ సినిమాకి సంగీత దర్శకుడిగా ఏ ఆర్ రెహమాన్ ని ఎంపిక చేశారు. కాగా రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ షూటింగ్ లో ఉన్నారు. ఈ మూవీ చిత్రీకరణ ఈ ఫిబ్రవరిలో పూర్తి కానుందని సమాచారం.
Next Story