Mon Dec 23 2024 02:02:11 GMT+0000 (Coordinated Universal Time)
SalaarVsKatera: మాట నిలబెట్టుకున్న దర్శన్.. షాక్ అవుతున్న జనం
కన్నడలో స్టార్ హీరో దర్శన్. ఆయన నటించిన సినిమా 'కాటేరా' బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన
కన్నడలో స్టార్ హీరో దర్శన్. ఆయన నటించిన సినిమా 'కాటేరా' బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన వసూళ్లను సాధిస్తూ ఉంది. ఈ సినిమా విడుదలకు ముందు తాము ఎలాంటి సినిమాకు కూడా భయపడడం లేదని తేల్చి చెప్పారు. తమది కన్నడ భాష సినిమా అని.. లోకల్ సినిమా అని.. ఇతర సినిమాలు వస్తున్నాయని తాము భయపడడం లేదని దర్శన్ చెప్పుకొచ్చారు. సలార్ సినిమా గురించి కొందరు జర్నలిస్టులు వేసిన ప్రశ్నకు దర్శన్ ఈ రకంగా సమాధానం చెప్పడం అప్పట్లో వైరల్ అయింది. అయితే దర్శన్ చెప్పిన మాటలు నిజమయ్యాయి.
కన్నడ స్టార్ హీరో దర్శన్ తాజా యాక్షన్ ఎంటర్టైనర్ కాటేరా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన వసూళ్లను సాధిస్తూ ఉంది. దర్శన్ క్రిస్మస్ సమయంలో సలార్ వస్తున్నాడని.. అది కాటేరాను దెబ్బతీస్తుందా అని ఒక ప్రశ్న వచ్చింది. "డబ్బింగ్ సినిమా గురించి నేనెందుకు చింతించాలి, కాటేరా కన్నడ ప్రేక్షకుల కోసం చేసిన కన్నడ చిత్రం.. నేను కన్నడ ప్రేక్షకులను నమ్ముతాను. మాకు పోటీగా సినిమాను విడుదల చేయడం గురించి వేరే చిత్రాలు ఆందోళన చెందాలి” అని ఆయన అన్నారు.
డిసెంబర్ 22న విడుదలైన సలార్ చిత్రం కర్ణాటకలో చాలా మంచి ఓపెనింగ్స్ ను సంపాదించుకుంది. కానీ అదే ఊపును కొనసాగించడంలో విఫలమైంది. ముఖ్యంగా కన్నడ ఉగ్రం కథ అంటూ కావాలనే కొందరు నెగటివ్ ప్రచారం చేయడం కర్ణాటకలో సలార్ కలెక్షన్స్ ను దెబ్బ తీసింది. కర్ణాటకలో సలార్ సినిమా గ్రాస్ దాదాపు 40 కోట్లకు చేరుకుంది. ఇక డిసెంబర్ 29న విడుదలైన కాటేరా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతోంది. 8.5 కోట్ల గ్రాస్తో తెరకెక్కిన ఈ సినిమా 4 రోజులలో గ్రాస్ 26 కోట్లకు చేరువైంది. కాటేరా సినిమా 1970ల నాటి కథ. ఇప్పటికీ ఉన్న సామాజిక సమస్యలను ఈ సినిమా హైలైట్ చేస్తుంది. తరుణ్ సుధీర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో తెలుగు నటుడు జగపతి బాబు కూడా కీలక పాత్ర పోషించారు. మాలాశ్రీ కూతురు ఆరాధనా రామ్కి ఈ సినిమా నటిగా కన్నడ చిత్ర పరిశ్రమలో మంచి డెబ్యూను ఇచ్చింది.
Next Story