Mon Dec 23 2024 10:30:03 GMT+0000 (Coordinated Universal Time)
కాంతార 2 అప్డేట్.. అప్పటి నుండే షూటింగ్ షురూ..
ఈ సినిమా షూటింగ్ కు వానాకాలం ముఖ్యం కావడంతో.. ఈ ఏడాది జూన్ లో షూటింగ్ మొదలవుతుందని, 2024 ఏప్రిల్ లేదా..
ఎలాంటి అంచనాలు లేకుండా.. అతిచిన్న సినిమాగా విడుదలై.. ఆ తర్వాత పాన్ ఇండియా సినిమాగా రికార్డులు సృష్టించింది కాంతార. ఇప్పుడు ఆస్కార్ కోసం.. బరిలో నిలబడింది. ముఖ్యంగా వరాహరూపం పాటకు ఎక్కడలేని క్రేజ్ వచ్చింది. ఆ పాటకోసమే సినిమా చూసినవారెందరో ఉన్నారు. సినీ ప్రియుల్లో ఇప్పటికీ కాంతార ఫీవర్ తగ్గలేదు. అప్పుడే కాంతార 2 అప్డేట్ వచ్చేసింది. డైరెక్టర్ అండ్ హీరో అయిన రిషబ్ శెట్టి.. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ లో బిజీ అయిపోయారట. ఈ విషయాన్ని‘హంబాలే ఫిల్మ్స్’ నిర్మాణ సంస్థ వ్యవస్థాపకుడు విజయ్ కిర్గందూర్ ‘డెడ్ లైన్’ న్యూస్ అనే సంస్థతో మాట్లాడుతూ తెలిపారు.
అయితే.. కాంతార 2 సీక్వెల్ కాదని, ప్రీక్వెల్ అని కొత్త విషయం తెలిపారు. అంతేకాదు ఎప్పుడు రిలీజ్ చేసేదీ చెప్పేశారు. ఈ సినిమా షూటింగ్ కు వానాకాలం ముఖ్యం కావడంతో.. ఈ ఏడాది జూన్ లో షూటింగ్ మొదలవుతుందని, 2024 ఏప్రిల్ లేదా మే నెలలో దేశవ్యాప్తంగా రిలీజ్ చేస్తామని విజయ్ తెలిపారు. స్క్రిప్ట్ పనిమీద ప్రస్తుతం రిషబ్ కర్ణాటకలోని కోస్టల్ రీజియన్ లో పర్యటిస్తున్నాడని, రెండునెలల పాటు అక్కడే తిరుగుతూ.. సంప్రదాయాలపై సమాచారం తెలుసుకుంటారని తెలిపారు. సినిమా స్టైల్ అంతా.. కాంతార మాదిరిగానే ఉంటుందన్న విజయ్.. ఇంకా నటీనటులను ఎంపిక చేయాల్సి ఉందన్నారు.
Next Story