డియర్ కామ్రేడ్ ఆర్ జెర్సీ?
ఒకప్పుడు తెలుగు సినిమా అంటే చాలా చులకనగా చూసేవారు బాలీవుడ్ వాళ్ళు. కానీ గత కొన్నేళ్ల నుండి పరిస్థితులు మారాయి. మన తెలుగు సినిమాలు తీసుకుని అక్కడ [more]
ఒకప్పుడు తెలుగు సినిమా అంటే చాలా చులకనగా చూసేవారు బాలీవుడ్ వాళ్ళు. కానీ గత కొన్నేళ్ల నుండి పరిస్థితులు మారాయి. మన తెలుగు సినిమాలు తీసుకుని అక్కడ [more]
ఒకప్పుడు తెలుగు సినిమా అంటే చాలా చులకనగా చూసేవారు బాలీవుడ్ వాళ్ళు. కానీ గత కొన్నేళ్ల నుండి పరిస్థితులు మారాయి. మన తెలుగు సినిమాలు తీసుకుని అక్కడ రీమేక్ చేసి హిట్ కొడుతున్నారు అక్కడ స్టార్స్. తెలుగు సినిమా స్టాండర్డ్స్ రోజురోజుకి పెరిగిపోవడంతో మన సినిమాల మీద కన్నేశారు బాలీవుడ్ నిర్మాతలు. ఈనేపథ్యంలోనే బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ ఇటీవల విడుదలైన డియర్ కామ్రేడ్ తో పాటు నాని నటించిన జెర్సీ చిత్రాల హిందీ రీమేక్ హక్కులను సొంతం చేసుకున్నారు.
షాహిద్ చెబితేనే…
అయితే ఈ రెండు సినిమాల్లో కరణ్ కి ఏ సినిమా ముందు తీయాలో అర్ధం కావడంలేదట. నిజానికి కరణ్ మొదట డియర్ కామ్రేడ్ చేద్దాం అనుకున్నాడు కానీ తెలుగు ఈసినిమా రిజల్ట్ వేరేలా రావడంతో జెర్సీ, డియర్ కామ్రేడ్ రెండు చిత్రాలలో ఏదో ఒక చిత్రం షాహిద్ తో చేయాలని భావిస్తున్న కరణ్ ఛాయిస్ షాహిద్ కే వదిలేశారట. కానీ షాహిద్ మాత్రం రెండింటిలో ఏ సినిమా చేస్తాడో మాత్రం చెప్పడంలేదట. షాహిద్ ఏదోకటి చెపితే త్వరగా ఆ సినిమాని సెట్స్ మీదకు తీసుకుని వెళ్లాలని భావిస్తున్నాడు.