Mon Dec 23 2024 13:51:03 GMT+0000 (Coordinated Universal Time)
కాఫీ విత్ కరణ్ షో పై కాపీ విమర్శలు
కాఫీ విత్ కరణ్ షో పై కాపీ విమర్శలు
కాఫీ విత్ కరణ్.. ఈ షోకు ఎంతో మంది అభిమానులు ఉన్నారు.. అంతే మంది విమర్శకులు కూడా ఉన్నారు. ముఖ్యంగా షో హోస్ట్ కరణ్ జోహార్ తనకు ఇష్టమైన వారిని మాత్రమే ఆహ్వానిస్తాడని..! ఎవరికైతే తాను గాడ్ ఫాదర్ లాగా ఉంటాడో వాళ్లను ఎంకరేజ్ చేయడానికే ఈ షో ను నిర్వహిస్తూ ఉంటాడనే విమర్శలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఈ షో సీజన్ 7 డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రసారం అవుతూ ఉంది.
ఈ షో పై ఇప్పుడు కాపీ ఆరోపణలు వస్తున్నాయి. అసలు రచయితకు తగిన క్రెడిట్ ఇవ్వకుండా కంటెంట్‌ను దొంగిలిస్తూ ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. జాన్వీ కపూర్, సారా అలీ ఖాన్‌లతో నిర్వహించిన ఇటీవలి ఎపిసోడ్లో సదరు వ్యక్తికి ఎటువంటి క్రెడిట్ ఇవ్వకుండా తన ఆలోచనలను ఉపయోగించారని రచయిత-జర్నలిస్ట్ సోషల్ మీడియాలో చెప్పారు. జాన్వీ- సారా సినిమాలను గెస్ చేయమని అడిగారు. ఆ సమయంలో ప్రశ్నలు ఓ జర్నలిస్ట్ రూపొందించినవని చెబుతున్నారు. సదరు వ్యక్తికి కనీసం క్రెడిట్ ఇవ్వకుండా ప్రశ్నలు అడుగుతూ వచ్చారు. ఈ షోలో ఒక రౌండ్ లో సినిమా కథను.. కథలాగా చెప్పకుండా వేరే విధంగా అడుగుతారు. అయితే ఇది గతంలో రచయిత-జర్నలిస్ట్ మాన్య లోహిత్ అహూజా కు చెందిన ప్రశ్న..! మాన్య లోహిత్ అహూజా ఎపిసోడ్ నుండి క్లిప్‌ను పోస్ట్ చేశారు, అలాగే 2020లో ఒక ఎంటర్టైన్మెంట్ పోర్టల్ కోసం ఆమె రాసిన కథనంలో అదే ప్రశ్న ఉంది. తన ప్రశ్నను కాపీ చేశారని.. కనీసం తనకు క్రెడిట్ ఇవ్వలేదని ఆమె ప్రశ్నిస్తూ ఉన్నారు.
ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో "నేను దీన్ని విడిచిపెట్టకూడదని నిర్ణయించుకున్నాను. నా పనికి నాకు క్రెడిట్ కావాలి- ఇది ప్రపంచాన్ని మార్చే పని కాకపోవచ్చు, అయితే ఇది నాది." ఆమె పోస్ట్‌లో కరణ్ జోహార్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, క్రియేటివ్ రైటర్ శ్రీమీ వర్మలను ట్యాగ్ చేసింది.
https://twitter.com/mushroomgalouti/status/1547911379419426816
News Summary - Karan Johar’s Koffee With Karan accused of plagiarism
Next Story