Sun Dec 22 2024 22:50:37 GMT+0000 (Coordinated Universal Time)
కార్తీ 'జపాన్' ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్
ఇటీవలే పూజా కార్యక్రమాలు నిర్వహించుకున్న‘జపాన్’ మూవీ నుండి.. నేడు ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేశారు మేకర్స్.
తమిళ హీరో కార్తీ.. వరుస సినిమాలతో ఫుల్ జోష్ మీద ఉన్నాడు. పొన్నియిన్ సెల్వన్, సర్దార్ సినిమాలతో వరుస హిట్లు తన ఖాతాలో వేసుకున్న కార్తీ.. వెంటనే మరో సినిమాను లైన్లో పెట్టేశాడు. తాజాగా వచ్చిన రెండు సినిమాల్లో కార్తీ డిఫరెంట్ లుక్స్ లో కనిపించాడు. పొన్నియన్ లో పోరాట యోధుడిగా, సర్దార్ లో డిఫరెంట్ షేడ్స్ ఉన్న స్పై గా నటించి అదరహో అనిపించాడు. పొన్నియన్ సెల్వన్-2 షూటింగ్ కూడా పూర్తి చేసుకున్న కార్తీ.. జపాన్ సినిమాతో వచ్చేందుకు రెడీ అయిపోయాడు.
ఇటీవలే పూజా కార్యక్రమాలు నిర్వహించుకున్న'జపాన్' మూవీ నుండి.. నేడు ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేశారు మేకర్స్. పోస్టర్ బట్టి చూస్తే ఇది మాఫియా అండ్ కామెడీ కథాంశంతో రాబోతున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాలో కార్తీ జపాన్ అనే ఒక చలాకి డాన్ పాత్రలో కనిపించబోతున్నాడు. కార్తీ ఈ పాత్రను పరిచయం చేస్తూ.. "జపాన్ మేడ్ ఇన్ ఇండియా. ఈ టిపికల్ రోల్ చేయడానికి చాలా ఆతృతగా ఎదురుచూస్తున్న" అంటూ ట్వీట్ చేశాడు.
కార్తీ 25వ చిత్రంగా రాబోతున్న ఈ సినిమాలో టాలీవుడ్ యాక్టర్ సునీల్ ఒక ముఖ్య పాత్ర చేస్తున్నాడు. సునీల్ కి ఇది మొదటి తమిళ స్ట్రెయిట్ ఫిల్మ్ కావడం విశేషం. రాజు మురుగన్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో కార్తీకి జోడీగా అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్ గా నటిస్తుంది. జి వి ప్రకాష్ సంగీతం అందిస్తున్నాడు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.
Next Story